మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
2024 సంవత్సరానికి బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అందుకున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం నిర్వహించిన 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం (నేషనల్ ఓటర్స్ డే) సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డును అందుకున్నారు. గత ఏడాది కృష్ణాజిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిగా 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణ, తప్పులు లేని, ఖచ్చితమైన ఓటర్ల జాబితా రూపొందించడంలో అత్యుత్తమ పనితీరు కనపరిచినందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డుకు డీకే బాలాజీని ఎంపిక చేశారు.
Tags machilipatnam
Check Also
విజన్‘కు – విధ్వంసానికి తేడా ప్రజలు తెలుసుకోవాలి… : రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత 5 ఏళ్ళుగా టిడ్కో ఇళ్ళను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే అభిప్రాయం …