విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశకు బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు-2024 లభించింది. శనివారం విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరిగిన 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. అత్యంత పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపకల్పన, అర్హులైన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు నిర్వహించే వినూత్న కార్యక్రమాలు, ఓటర్లను జాగృతం చేయడం తదితర అంశాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు కలెక్టర్ లక్ష్మీశ ఈ అవార్డును అందుకున్నారు. అవార్డు అందుకున్న లక్ష్మీశను సీఎస్ విజయానంద్తో పాటు మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డా. నిమ్మగడ్డ రమేష్ కుమార్, జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎ.వెంకటేశ్వరరావు, జిల్లా అధికారులు అభినందించారు.
Tags vijayawada
Check Also
విజన్‘కు – విధ్వంసానికి తేడా ప్రజలు తెలుసుకోవాలి… : రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత 5 ఏళ్ళుగా టిడ్కో ఇళ్ళను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే అభిప్రాయం …