Breaking News

ఇంజినీరింగ్, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక అధికారులకు తగు ఆదేశాలు జారీ…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలోని తారకరామ నగర్ మెయిన్ రోడ్ విస్తరణ పనులను పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులు సమన్వయంతో వేగంగా చేపట్టాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. శనివారం కమిషనర్ తారకరామ నగర్, ఎస్వీఎన్ కాలనీ, పెద్ద పలకలూరు రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి, ఇంజినీరింగ్, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత తారకరామ నగర్ విస్తరణ పనుల పురోగతిపై పట్టణ ప్రణాళిక అధికారులను, రోడ్ నిర్మాణ పనులపై ఇంజినీరింగ్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని, మాట్లాడుతూ విస్తరణ పనులు వేగంగా జరగాలని, అవసరమైతే అదనపు సిబ్బందిని కేటాయించుకోవాలన్నారు. విస్తరణ ప్రభావిత భవనాలకు చట్ట ప్రకారం నష్ట పరిహారం, స్తలాలకు టిడిఆర్ బాండ్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఏసిపి ని ఆదేశించారు. అనంతరం పెద్ద పలకలూరులోని సత్య అపార్ట్మెంట్ ప్రాంతాన్ని పరిశీలించి, స్థానికులతో మాట్లాడి పారిశుధ్య పనులు పూర్తి స్థాయిలో చేపట్టాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ని, డ్రైనేజి సమస్య, వీధి దీపాల సమస్యలు పరిష్కారానికి జిఎంసి నుండి అవసరమైన చర్యలు తీసుకోవాలని డిఈఈని ఆదేశించారు. పెద్ద పలకలూరు చెరువుని పరిశీలించి, చెరువులో నీటి నిల్వకు, సదరు ప్రాంతంలో బోర్ వెల్ ఏర్పాటు చేసి స్థానిక ప్రాంతాల్లోకి సరఫరా చేయడానికి, చెరువు చుట్టూ జంగిల్ క్లియర్ చేయాలని డిఈఈని ఆదేశించారు.
పర్యటనలో డిఈఈ శ్రీనివాస్, ఏసిపి రెహ్మాన్, కార్పొరేటర్లు వి.శ్రీరాం ప్రసాద్, బి.స్మిత పద్మజ, టిపియస్, టిపిబిఓలు, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజన్‘కు – విధ్వంసానికి తేడా ప్రజలు తెలుసుకోవాలి… : రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత 5 ఏళ్ళుగా టిడ్కో ఇళ్ళను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే అభిప్రాయం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *