విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రథాన కార్యదర్శి కె.విజయానంద్ వారీ చేతుల మీదుగా శనివారం తుమ్మలపల్లి కళాక్షేత్రం లో జరిగిన కార్యక్రమం లో 15 వ ఓటరు దినోత్సవం సందర్భంగా విజయవాడలో యువ ఓటర్ల నమోదు చెయడంలో అవార్డు భాగంగా కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత అవార్డ్ అందుకున్నారు. రాష్ట్రంలో ఎలెక్టోరల్ జాబితా రూపకల్పన ఉత్తమ పనితీరు చూపిన 11 మంది రెవిన్యూ డివిజన్ అధికారులను అవార్డ్ కి ఎంపిక చెయ్యడం జరిగింది. ఇందులో భాగంగా కొవ్వూరు డివిజన్ పరిధిలో 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న యువ ఓటర్ల నమోదులో 98 శాతం పైగా నమోదు చేయడం జరిగింది. కొవ్వూరు తహసిల్దార్ దుర్గా ప్రసాద్ ఏ ఈ ఆర్ ఓ గా అవార్డ్ అందుకున్నారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, ఇతర అధికారులు ఆర్డీవో రాణి సుస్మిత ను అభినందించారు.
Prajavartha Online Telugu News