Breaking News

ప్లాస్టిక్ కాలుష్యంపై ప్రజా ప్రగతి ట్రస్ట్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్లాస్టిక్ కాలుష్యంపై ప్రజా ప్రగతి ట్రస్ట్ ఆధ్వర్యంలో పున్నమి ఘాటు వద్ద అవగాహన కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో కియో మోటార్స్ CEO రష్య, సీనియర్ మేనేజర్ మారుతి, స్థానిక కార్పొరేటర్ ఆంజనేయ రెడ్డి, టూరిజం శాఖ డిప్యూటీ ఇంజనీర్ శ్రీనివాస యాదవ్ ప్రజాప్రతి ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాసులు పాల్గొన్నారు. అపార్ట్మెంట్ ప్రతినిధులు ఇంద్ర ఎంక్లేవ్ సెక్రటరీ శరత్ చంద్ర, శ్రీనివాస్ అపార్ట్మెంట్స్ మరియు బొమ్మరిల్లు అపార్ట్మెంట్స్ ప్రతినిధులు, ప్లాస్టిక్ కాలుష్యం దుష్ఫలితాలపై వ్యక్తులు ప్రసంగించారు.
ఈ ప్లాస్టిక్ కాలుష్యం వల్ల సముద్ర గర్భంలో 1500 రకాల జీవరాసులు అంతరించి పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మైక్రో ప్లాస్టిక్ మూలాలు నీటి లోపల, భూమి లోపల ప్రవేశించడం వలన అవి ఆహార వలయంలో ప్రవేశించి ప్రజా ఆరోగ్యం పై తీవ్ర ప్రభావాలను చూపుతోందని సీనియర్ జర్నలిస్టు నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ కాలుష్య ప్రభావానికి గురై నటు వంటి రొయ్యలు, చేపలు మొదలైనవి సముద్ర ఆహారం వినియోగించడం వలన మనుషుల హార్మోన్లపై, పునరుత్పత్తిపై కూడా ప్రభావితం చేస్తున్నట్లు తెలిపారు. టూరిజం డిపార్ట్మెంట్ అధికారి శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం సాధ్యమైనంత వరకు తగ్గించాలని, వినియోగించిన ప్లాస్టిక్ను సరైన పద్ధతిలో విసర్జించాలని తెలిపారు
. కార్యక్రమంలో పాల్గొన్న వివిధ ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు కృష్ణానది తీరంలో పున్నమి ఘాట్ వద్ద ప్లాస్టిక్ విసర్జితాలను శుభ్రం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *