Breaking News

సీతమ్మధారలో అభయాంజనేయస్వామి ఆలయం కూల్చివేత బాధాకరం

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేవాలయాల కూల్చివేతలు, అర్చకులపై దాడులు పెరిగిపోయాయని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. విశాఖ సీతమ్మధారలో అభయాంజనేయస్వామి ఆలయం కూల్చివేతపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే ఆలయాన్ని కూల్చివేయటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుసరించాల్సిన నిబంధనలను పాటించకుండా అత్యుత్సాహంతో అధికారులు ఆలయాన్ని కూలగొట్టడం క్షమించరాని నేరమన్నారు. నెల్లూరులోను రహదారి విస్తరణ పేరుతో ఇటీవల నాగమ్మ ఆలయాన్ని కూల్చివేసి దేవతామూర్తుల విగ్రహాలను పెకలించారని గుర్తు చేశారు. పల్నాడులో 15 ఏళ్లుగా భక్తులు పూజిస్తున్న త్రికోటేశ్వరస్వామి, కనకదుర్గమ్మ ఆలయాన్ని కూల్చివేశారన్నారు. స్థానిక మధురానగర్ కాలువగట్టుపై 40 ఏళ్ల నాటి నాగేంద్రస్వామి పుట్టని తొలగించటంతో పాటు శ్రీకృష్ణ మందిరం వద్ద ఏర్పాటు చేసిన గోశాలను కూడా దౌర్జన్యంగా కూల్చివేశారన్నారు. రాజకీయ కుట్రలతో ఆలయాలను కూల్చివేస్తూ.. కూటమి ప్రభుత్వం హిందువుల మనోభావాలతో ఆడుకుంటోందని మల్లాది విష్ణు అన్నారు. గతంలోనూ హిందూ దేవాలయాలపై దాడులు, కూల్చివేతలు అత్యధికంగా జరిగినది టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి అధికారాన్ని పంచుకున్న సమయంలోనేనని గుర్తు చేశారు. 2014-19 మధ్యకాలంలో రోడ్డు విస్తరణ ముసుగులో పదుల సంఖ్యలో దేవాలయాలను కూల్చివేయించారని మల్లాది విష్ణు అన్నారు. దాదాపు 100 కి పైగా తీవ్రమైన ఘటనలు జరిగినప్పటికీ అప్పటి ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందన్నారు. చెత్త తరలించే వాహనాలలో దేవతామూర్తుల విగ్రహాలను తీసుకెళ్లిన దారుణ సంఘటనలు చోటు చేసుకుంది 2014-19 మధ్యకాలంలో కాదా..? అని సూటిగా ప్రశ్నించారు. ప్రస్తుత ప్రభుత్వంలోనూ అత్యంత పూజ్యమైన తిరుమల ఆలయంతో పాటు పలు హిందూ దేవాలయాల పవిత్రతపై రాజీ పడుతూ.. ఈ ప్రభుత్వం భక్తుల కష్టాలను మరింత తీవ్రతరం చేస్తోందని ఆరోపించారు. హిందూ దేవాలయాలపై ఈ ప్రభుత్వం పగబట్టిందని.. సనాతన ధర్మ రక్షకులుగా గప్పాలు కొట్టుకునే నాయకులు వీటిపై ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. దేవాలయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని.. శ్రీరామనవమిలోగా విశాఖలో కూల్చిన ఆలయాన్ని పునఃప్రతిష్టించాలన్నారు. ఘటన వెనుక ఎవరున్నా కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దఎత్తున ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈనెల 31వ తేదిన జరిగే శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

-పెనుగొండ ఆలయంలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం -ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మెన్ డూండి రాకేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *