Breaking News

ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.10 లక్షల విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆల్ ఇండియా బీఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు రూ.10 లక్షల విరాళం ఇచ్చారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ నేతృత్వంలో సీఎం చంద్రబాబును ఉండవల్లి నివాసంలో కలిసి రూ.10,46,169 చెక్కును అందించారు. సీఎంకు చెక్కును అందజేసిన వారిలో అసోసియేషన్ ప్రతినిధులు డి.గోపాలకృష్ణ, వరప్రసాద్, తదితరులు ఉన్నారు. గతేడాది విజయవాడలో వచ్చిన వరదల కారణంగా సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు తమవంతుగా విరాళంగా ఇచ్చినట్లు వారు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *