Breaking News

శంబర పోలమాంబకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి

పార్వతీపురం, నేటి పత్రిక ప్రజావార్త :
శంబర పోలమాంబకు మంగళవారం రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి పట్టు వస్త్రాలను సమర్పించారు. మంత్రి సంధ్యా రాణి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానం కార్యనిర్వహణ అధికారి నారాయణ రావు, అర్చకులు సంప్రదాయబద్దంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికి, అమ్మవారి పట్టువస్త్రాలు అందించి, ఆలయ సంప్రదాయంతో ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వచనాలు అందించాలని ఆకాక్షించారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించే మహత్కర భాగ్యాన్ని కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు మంత్రి  కృతజ్ఞతలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *