Breaking News

పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక

-నేను పాతికేళ్లుగా మా అత్తగారి ఊరు కుప్పంలో సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నాను
-తెలుగుదేశం కార్యకర్తలకు మా కుటుంబం రుణపడి ఉంటుంది
-బెంగుళూరు టీడీపీ ఫోరం నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో నారా భువనేశ్వరి

బెంగుళూరు, నేటి పత్రిక ప్రజావార్త :
మన పండుగలు మనుషుల మధ్య అనుబంధాలను బలోపేతం చేస్తాయని, మన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడతాయని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. తమ కుటుంబానికి సంక్రాంతి పండుగ చాలా ప్రత్యేకమని చెప్పారు. బెంగుళూరు టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

భారతీయ సంస్కృతిలో పండుగలకు విశిష్ట స్థానం

పండుగలు అంటే ఒక సంతోషం. పేద, ధనిక తేడా లేకుండా కుటుంబసభ్యులు , బంధుమిత్రులతో కలిసి సంతోషంగా పండుగలు జరుపుకుంటాము. మన సంస్కృతి, సంప్రదాయాలకు పండుగలు ప్రతీకగా నిలుస్తాయి. నేను ఈ తరం వారిని కోరేది ఒకటే. ప్రతి ఒక్కరూ మన పెద్దలు ఏర్పాటు చేసిన సంప్రదాయాలను గౌరవించాలి. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మన మూలాలను, మన ఆచారాలను మర్చిపోకూడదు.

సంక్రాంతి అంటే గుర్తొచ్చేది కుప్పమే

సంక్రాంతి పండుగ మాకు ఎప్పుడూ ప్రత్యేకమే. సంక్రాంతి అంటే చాలు మాకు కుప్పం గుర్తొచ్చేస్తుంది. గత 25 ఏళ్లుగా మా అత్తగారి ఊరిలో సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నాము. కుటుంబసభ్యులమంతా కలుస్తాము. ఆ మూడు రోజులు సరదాగా గడుపుతాము. ఊరిలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటాము. గ్రామ దేవతకు పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటాము.

నిత్యం ప్రజల కోసం తపించే వ్యక్తి చంద్రబాబు

చంద్రబాబు గారికి కుటుంబం అంటే తెలుగుదేశం కార్యకర్తలే. ఆయన ఎప్పుడూ ప్రజలకు మేలు చేయడం గురించే ఆలోచిస్తారు. నాడు చంద్రబాబు గారు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చి లక్షలాదిమంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం నాకెంతో సంతోషానిచ్చింది. చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ కు వ్యతిరేకంగా ప్రపంచంలోని తెలుగువారంతా ఏకమై మద్దతు తెలిపారు. నేను నిజం గెలవాలి కార్యక్రమం చేపట్టినప్పుడు టీడీపీ కార్యకర్తలు, ముఖ్యంగా మహిళా లోకం నా వెంట నడిచింది. అండగా నిలబడింది. గత ఐదేళ్లలో టీడీపీ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా ఎక్కడా ధైర్యం కోల్పోకుండా ప్రాణాలు పణంగా పెట్టి పార్టీని గెలిపించారు. నాడు బ్రిటీష్ వారితో పోరాడి ప్రజలు స్వాంత్రత్యం ఎలా సాధించారో అదే విధంగా గత ఐదేళ్ల పాలనలో ఇబ్బందులు పడ్డ ప్రజలు అదే స్థాయిలో పోరాడి ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు.

బెంగుళూరు టీడీపీ ఫోరంని అభినందిస్తున్నా

నేను ఈ సందర్భంగా బెంగుళూరు టీడీపీ ఫోరంని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. బెంగుళూరు టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో గత పదేళ్లుగా సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తున్నందుకు అభినందనలు. పార్టీ బలోపేతానికి మీరు చేస్తున్న కృషి వెలకట్టలేనిది. ఫోరం ఆధ్వర్యంలో మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలను ఇదే స్పూర్తితో మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నానని నారా భువనేశ్వరి అన్నారు. సంక్రాంతి వేడుకల్లో టీడీపీ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, టీడీపీ కల్యాణ దుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈనెల 31వ తేదిన జరిగే శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

-పెనుగొండ ఆలయంలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం -ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మెన్ డూండి రాకేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *