Breaking News

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిఎంసి శకటానికి ద్వితీయ స్థానం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఆదివారం జరిగిన గుంటూరు జిల్లా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గుంటూరు నగరపాలక సంస్థ “స్వచ్చ ఆంధ్ర-స్వచ్చ దివస్” అంశం పై రూపొందించిన శకటం ద్వితీయ స్థానంలో నిలిచిందని నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ తెలిపారు. ప్రశంశా పత్రాన్ని జిల్లా కలెక్టర్ యస్.నాగలక్ష్మి చేతుల మీదుగా కమీషనర్ మరియు ప్రజారోగ్యాదికారులు అందుకున్నారు.
ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 3 వ శనివారం ప్రత్యేక థీం ప్రకారం ప్రనాళికాబద్దమైన పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టడానికి ప్రవేశపెట్టిన స్వచ్చ ఆంధ్ర – స్వచ్చ దివస్ ని అమలు చేస్తుందన్నారు. గుంటూరు నగరంలో స్వచ్చ ఆంధ్ర – స్వచ్చ దివస్ భాగంగా చేపట్టిన, చేపట్టనున్న కార్యక్రమాల ప్రాతిపదికగా శకటాన్ని రూపొందించామని, ఈ శకటానికి జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం రావటం ముదావహమన్నారు.
గణతంత్ర దినోత్సవంలో భాగంగా జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన వేడుకలలో జి.యం.సి నుండి విధుల్లో ఉత్తమ పురస్కారాలను డి.ఈ.ఈ యం.రమేష్ బాబు, ఎ.సి.పి సి.హెచ్ వెంకటేశ్వర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్ అంగడి బాబు, ఎస్టాబ్లిష్మెంట్ నుండి సి1 పఠాన్ నజీర్, ఆర్.ఐ కె.జ్యోతిర్మయి అందుకున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజన్‘కు – విధ్వంసానికి తేడా ప్రజలు తెలుసుకోవాలి… : రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత 5 ఏళ్ళుగా టిడ్కో ఇళ్ళను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే అభిప్రాయం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *