-పద్మ పురస్కారాలు పొందిన వారికి శుభాకాంక్షలు
-తెలుగు రాష్ట్రాల్లో 7 మందికి అవార్డులు దక్కడం గర్వకారణం
-షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతిభను పద్మ పురస్కారాలు వరించాయని, తెలుగు రాష్ట్రాల్లో ఏడు మందికి అవార్డులు దక్కడం గర్వకారణమని ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. వైద్యం, కళలు, సాహిత్యం, ప్రజా సేవ తదితర రంగాల్లో విశేష కృషి చేసి దేశానికి గర్వకారణంగా నిలిచిన వీరి కీర్తి తెలుగువారందరికీ తరగని నిత్య స్ఫూర్తి అని కొనియాడారు. ప్రతిభాపాటవాలతో దేశ అత్యున్నత పురస్కారాలు అందుకున్న డా. నాగేశ్వరరెడ్డి (పద్మవిభూషణ్), నందమూరి నట సింహం బాలకృష్ణ (పద్మభూషణ్), మందకృష్ణ మాదిగ (పద్మశ్రీ), మాడుగుల నాగఫణిశర్మ (పద్మశ్రీ), మిర్యాల అప్పారావు (పద్మశ్రీ), కేఎస్ కృష్ణ (పద్మశ్రీ), వాదిరాజ్ రాఘవేంద్రాచార్య (పద్మశ్రీ) లకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా సినిమా, రాజకీయం, దాతృత్వం లో రాణిస్తూ ఎన్టీఆర్ వారసత్వాన్ని నిలబెట్టిన నందమూరి బాలకృష్ణ కు పద్మ భూషణ్ పురస్కారం వరించడం ఆనందంగా ఉందని తెలిపారు. తెలుగురాష్ట్రాల నుంచి ఏడుగురుకి ఈ గౌరవం అందించిన కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.