విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ నూతన కార్యవర్గ సమావేశం జరిగింది. ఆదివారం విజయవాడ, హనుమాన్ పేట, మారుతి ఫంక్షన్ హాల్లో విశ్వ బ్రాహ్మణ రాష్ట్ర అధ్యక్షులు చేవూరి రామస్వామి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చేవూరు రామస్వామి మాట్లాడుతూ ఈ సమావేశంలో రాష్ట్ర 26 జిల్లాల నుంచి సంఘ ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మా సంఘానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు అదేవిధంగా మా సంఘాన్ని గుర్తించి ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవిని కూడా ఇవ్వాలని ఆయన ఉన్నారు. విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులను అమలు చేయాలని ఆయన తెలిపారు. విశ్వబ్రాహ్మణులు వడ్రంగి కుమ్మరి కంచర, స్వర్ణకార, శిల్పకళాకారు మొదలగువారు ఈ వృత్తిలో ఉన్నారని, వారని కూడా ప్రభుత్వం గుర్తించి రావాల్సిన నిధులను వారికే కేటాయించే విధంగా నిర్ణయించాలని అన్నారు. అంతేకాకుండా అమరావతి రాజధానిలో ఐదు ఎకరాల భూమిని విశ్వబ్రాహ్మణ సంఘానికి కేటా యించాలని కోరారు. బ్రాహ్మణ నాయి బ్రాహ్మణుల మాదిరిగా పలు దేవాలయాల్లో మా కులస్తులకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలని ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. నూతన కమిటీ ఎన్నిక జరిగింది. భవిష్యత్ కార్యాచరణ, తీర్మానాలు ఆమోదం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జెసి ప్రసాద్, బొందల పాటి ఉమామహేశ్వ రరావు, కృష్ణాజిల్లా అధ్యక్షులు గొర్తి శ్రీనివాస చక్రవర్తి, రాష్ట్ర కోశాధికారి ఫిరంగి రమణా చార్య తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఈనెల 31వ తేదిన జరిగే శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
-పెనుగొండ ఆలయంలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం -ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మెన్ డూండి రాకేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త …