Breaking News

ఏపీ హైకోర్టులో ఘనంగా గణతంత్య్ర దినోత్సవ వేడుకలు

-రాజ్యాంగం స్పూర్తికి విఘాతం కలుగకుండా న్యాయ వ్యవస్థ గార్డియన్ పనిచేస్తున్నది
-రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అవరణలో 76 వ భారత గణతంత్య్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం సభికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమలుకు ఎటు వంటి విఘాతం కలుగకుండా న్యాయ వ్యవస్థ ఒక గార్డియన్ లా పనిచేస్తున్నదన్నారు. అటు వంటి వ్యవస్థలో పనిచేసే న్యాయమూర్తులు, న్యాయవాదులు ఎంతో బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. సార్వభౌమ సామ్యవాద లౌలిక ప్రజాస్వామ్య గణతంత్య్ర దేశంగా అభివృద్ద పథంలో మన దేశం మరింత ముందుకు వెళ్లేందుకు 76 వ భారత గణతంత్య్ర దినోత్సవ వేడుకలు ప్రతీకగా నిలుస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ 1950 లో ప్రజాస్వామ్య గణతంత్య్ర దేశంగా అవతరించిన భారత దేశం ప్రపంచలోని పలు గణతంత్య్ర దేశాలకు ఆదర్శంగా నిలిచేలా అద్బుతమైన గణతంత్య్ర దేశంగా నేడు ఆవిషృతమైందన్నారు. సాంప్రదాయ, ఆధునికతలను మేళవిస్తూ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ది చెందేందుకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించే విషయంలో మన రాజ్యాంగం ఎంతగానో దోహపడుతున్నదన్నారు. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలను అన్నింటినీ ఆకళింపుచేసుకుని వాటి పరిష్కారానికై ఎంతో విలువైన రాజ్యాంగాన్ని మనకు అందజేసిన మహోన్నత వ్యక్తులు అందరికీ శిరస్సు వంచి శ్రద్దాంజలి ఘటించాల్సి ఉందన్నారు.

అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ మహోన్నతమైన మన రాజ్యాంగ స్పూర్తిని పరిరక్షిడంలో న్యాయవాదులు కీలక పాత్రి పోషించాల్సి ఉందన్నారు. కేవలం వారు కోర్టు గదులకే పరిమితం కాకుండా గ్రౌండ్ రియాలటీలను అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.

రాష్ట్ర వ్యాయవాదుల మండలి అధ్యక్షుడు ఎన్.ద్వారకానాథ్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ప్రజా స్వామ్య వ్యవస్థ మనుగడ సాగించడంలో న్యాయ వ్యవస్థ కీలక భూమి పోషిస్తున్నదన్నారు. తద్వారా అన్ని వర్గాల ప్రజలు స్వేచ్చా స్వాతంత్ర్యాలతో అభివృద్ది పదంలో పయనించేందుకు అవకాశాలు ఏర్పడ్డాయన్నారు.

హైకోర్టు న్యాయ వాదుల సంఘం అధ్యక్షులు కె.చిదంబరం మాట్లాడుతూ భారత రాజ్యాంగానికి సంరక్షకులుగా న్యాయవాదులు పనిచేస్తూ రాజ్యాంగ స్పూర్తిని కాపాడాల్సిన భాద్యత న్యాయవాదులపై ఉందన్నారు.

ఈ గణతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పలువురు న్యాయమూర్తులు, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పి.పొన్నారావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండా లక్ష్మీనారాయణ్, అదనపు అడ్వకేట్ జనరల్ ఇ.సాంబశివ ప్రతాప్, హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్ (ఎఫ్ఎసి) శ్రీనివాస శివరాం, పలువులు రిజిష్ట్రార్లు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈనెల 31వ తేదిన జరిగే శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

-పెనుగొండ ఆలయంలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం -ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మెన్ డూండి రాకేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *