-నిరుపేద కుటుంబాలకు తోపుడు బండ్లు అందచేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
175 అసెంబ్లీ సీట్లలో కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు పొందడంలో నారా లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్ర పాత్ర చాలా ఉందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు.
నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సోమవారం ఉదయం తూర్పు నియోజకవర్గం 13వ డివిజన్ కు చెందన ఎం.డి.కరిమొల్లా, బొజ్జర్లపూడి సుమలతలకు స్వయం ఉపాధి చేసుకునే నిమిత్తం రూ.30 వేలు విలువ చేసే రెండు తోపుడు బండ్లను ఎమ్మెల్యే గద్దె రామమోహన్ తన సొంత నిధులతో కోనుగోలు చేసి వారికి ఉచితంగా అందచేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేపట్టి నేటికి రెండు సంవత్సరాలు పూర్తి అయ్యాయని చెప్పారు. యువగళం పాదయాత్ర ద్వారా తెల్సుకున్న సమస్యలను పరిష్కరించడం కూడా జరుగుతోందన్నారు. తెలుగుదేశం పార్టీకి మరో యాభై సంవత్సరాలు పాటు నాయకత్వానికి ఢోకా లేదని నారా లోకేష్ నిరూపించారని చెప్పారు. యువగళం పేరుతో ప్రజలను సమీకరించి ఒక ఉద్యమం మాదిరిగా నిర్వహించారని అన్నారు. యువగళం పాదయాత్ర తర్వాత నారా లోకేష్‌ను ఎదుర్కోవడం ఏవరి వల్ల సాధ్యం కాదని స్పష్టమైందన్నారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 164 సీట్లు కూటమి అభ్యర్థులు గెలుపొందారంటే నారా లోకేష్ చేసిన యువగళం పాదయాత్ర పాత్ర చాలా ఎక్కువుగా ఉందన్నారు. మంత్రిగా నారా లోకేష్ ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచి ప్రజాదర్భార్‌ను నిర్వహిస్తూ ప్రజా సమస్యలను స్వయంగా తెల్సుకుంటూ వాటిని పరిష్కరిస్తున్నారని అన్నారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో 90 వేల ఓట్లకు పైగా అత్యధిక మెజార్టీతో నారా లోకేష్ గెలిచి అత్యధిక మెజార్టీ పొందిన జాబితాలో నారా లోకేష్ రెండో స్థానంలో ఉన్నారని చెప్పారు. మంగళగిరిలోని ప్రతి సమస్యను పరిష్కరిస్తూ అక్కడి ప్రజల మన్ననలు నారా లోకేష్ పొందుతున్నారని అన్నారు. యువగళం పాదయాత్ర చేపట్టిన రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నారా లోకేష్‌కు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్ మరణం తర్వాతా ముప్పై సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పార్టీని సమర్థవంతంగా నడిపారని, పదిహేను సంవత్సరాలు తర్వాత నారా లోకష్ పార్టీ బాధ్యతలు తీసుకుని మరింత సమర్థవంతంగా పార్టీని నడుపుతారని అన్నారు.
కార్పోరేటర్ పొట్లూరి సాయిబాబు మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండటమే కాకుండా ఏ కష్టం వచ్చినా నేను ఉన్నానంటూ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ఈ డివిజన్‌లో ఉండటం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. డివిజన్‌లోని పేద కుటుంబాల జీవనోపాధికి రెండు తోపుడు బండ్లను ఎమ్మెల్యే గద్దె రామమోహన్ తన సొంత నిధులతో కొనుగోలు చేసి వారికి ఉచితంగా అందచేయడం సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ ముమ్మినేని ప్రసాద్, సాయిన బుజ్జి, తుమ్మల శ్రీను, కోడే సాంబశివరావు, యలమంచిలి రవీంద్ర, చలసాని రమణ, రాధావరపు యల్లబాబు తదితరులు పాల్గొన్నారు.