విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
2023 జనవరి 27 కుప్పం నుండి ప్రారంభమైన యువగళం పాదయాత్ర నేటికీ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఫతాఉల్లాహ్ తన కార్యాలయం ఖిద్మత్ ఘర్ వద్ద లోకేష్ అభిమానుల మధ్య కేక్ కట్ చేసి రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం మహమ్మద్ ఫతావుల్లా మాట్లాడుతూ 11 ఉమ్మడి జిల్లాలు 27 నియోజకవర్గాలు 232 మండలాలు 2028 గ్రామాలకు మీదుగా 3132 కిలోమీటర్లు సాగిన యువగళం పాదయాత్ర తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రస్థానంలో ఒక ప్రత్యేకతను చాటుకుందని అన్నారు. ఎస్సీ ,ఎస్టీ, బీసీ, మైనారిటీలకు భరోసా కల్పించిన యాత్ర యువగళం పాదయాత్ర అని అలాగే జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన నుండి విముక్తి కల్పించి నారా చంద్రబాబు నాయుడు అని ముఖ్యమంత్రిగా చేయుటకు దోహదపడిన యాత్ర యువగళం పాదయాత్ర అని అన్నారు. మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారని అలాగే నారా లోకేష్ ఇంకా ఉన్నత స్థానాల్లో ఉండాలని అల్లాను కోరుకుంటున్నానని అన్నారు
తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు షేక్ ఆషా మాట్లాడుతూ మహిళలకు భరోసా కల్పించిన యాత్ర ఈ యువగళం పాదయాత్ర అని జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నినదించిన యాత్ర ఈ ఇవ్వగలం పాదయాత్ర అని అన్నారు
ఈ కార్యక్రమంలో తమేం అన్సార్, జాహెద్, ఇమ్రాన్,సూకసి సరిత,శంకర్, హబీబ్, ఫిరోజ్, అలీ,మల్లీశ్వరి,రేష్మా, ముంతాజ్, వడ్డాది రవీంద్ర , డూండీ, ధన, తదితర నాయకులు పాల్గొన్నారు.