Breaking News

జిల్లా సమీక్షా కమిటీ సమావేశం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా ఇన్ చార్జ్ మంత్రి మరియు రాష్ట్ర పర్యాటక , సాంస్కృతిక , సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన ఈ నెల 28 వ తేది ( మంగళవారం ) ఉదయం 10.30 గంటలకు కలక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా ముఖ్య ప్రణాళికా అధికారి నేడొక ప్రకటనలో పేర్కొన్నారు. సమావేశంలో అజెండా అంశాలైన వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు , పరిశ్రమలు మరియు స్కిల్ , గుంటూరు నగరపాలక సంస్థ , యంటీయంసీ , హౌసింగ్ , డిస్ట్రిక్ట్ వాటర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ , మెడికల్ అండ్ హెల్త్ , విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖలపై సమీక్షించడం జరుగుతుంది. గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి, ప్రజాప్రతినిధులు , అధికారులు సమావేశానికి హాజరు కానున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *