Breaking News

బీసీ మంత్రులకు జరిగిన అభినందన సత్కార కార్యక్రమం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
బలహీన వర్గాలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా అభివృద్ధి చేసింది దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని , ఇదే స్పూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన నాయుడు అన్నారు.
సోమవారం స్థానిక శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో బీసీ మంత్రులకు జరిగిన అభినందన సత్కార కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన నాయుడు, రాష్ట్ర వ్యవసాయ, సహకార , పశు సంవర్ధక, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర బీసీ సంక్షేమం , ఆర్దికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం , చేనేత శాఖ మంత్రి ఎస్ సవిత, రాష్ట్ర హౌసింగ్, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి, రాష్ట్ర ఎంఎస్ఎంఈ , సెర్ఫ్ , ఎన్ ఆర్ ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో కలసి పాల్గొన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహననాయుడు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించటం ద్వారానే పంచాయితీ కార్యాలయం మెట్లు కూడ ఎక్కని బీసీలు ఏకంగా పార్లమెంటు సభ్యులై పార్లమెంటు మెట్లు ఎక్కే స్థాయికి ఎదిగారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించటంతో పాటు వారి సాధికారికతకు వెన్నుదన్నుగా ఉంటున్నారన్నారు. బీసీలకు సంక్షేమంతో పాటు నాణ్యమైన విద్యను అందించటం ద్వారా దేశ స్థాయిలోనే కాకుండా విదేశాల్లో సైతం విద్యను అభ్యసించటంతో , ఉన్నత ఉద్యోగాలు సాధించారన్నారు. భవిష్యత్తు తరం ఎక్కడికో వెళ్లి ఉద్యోగాలు చేసే పరిస్థితి కాకుండా ఇక్కడే ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగేలా ముఖ్యమంత్రి చంద్రబాబు పునాదులు వేస్తున్నారన్నారు. వెనుకబడిన తరగతుల వారందరూ ఐకమత్యంగా ఉంటేనే వారు అనుకున్న లక్ష్యాలను సాధించటం సాధ్యం అవుతుందన్నారు. వీరు పనిచేయకపోతే దేశమే ఆగిపోతుందని, వారికి ఉన్న నైపుణ్యాలతో పరిశ్రమల ఏర్పాటు చేసేలా భావితరాల వారిని ప్రోత్సహించాలన్నారు. వెనుకబడిన తరగతుల వారి సమస్యలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అవి పరిష్కరించేలా నిరంతరం కషి చేస్తామన్నారు.
రాష్ట్ర హౌసింగ్ , సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి, సంపద పెరిగితేనే బడుగు, బలహీన వర్గాలకు ఉపాధి అవకాశాలు పెరిగి వారు అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తారన్న లక్ష్యంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకువచ్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్నారు. గత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంక్షేమం పేరుతో రాష్ట్ర వనరులను దోచుకున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. విధ్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించటంతో పాటు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించటానికి వారికి స్కిల్ డెవలప్మేంట్ సెంటర్లు ద్వారా నైపుణ్యం శిక్షణ అందిస్తున్నారన్నారు. బలహీన వర్గాల వారు ఆర్ధికంగా బలోపేతం అవటం ద్వారానే సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. బలహీనవర్గాల ప్రజలు స్వయం ఉపాధి పథకాలు, వ్యాపార నిర్వహణకు ఆర్ధిక సంస్థల నుంచి రుణాలు సాధించటానికి ప్రయత్నించాలన్నారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయటం తోపాటు ప్రజలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలని చంద్రబాబు నాయుడు పాలన చేస్తున్నారు. ప్రతి కుటుంబాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసే ప్రయత్నం చేయాలన్న ఆలోచన ధోరణి ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోనే బీసీల భవిష్యత్తు పదిలంగా ఉంటుందన్నారు.
రాష్ట్ర వ్యవసాయ, సహకార , పశు సంవర్ధక, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టారన్నారు. అదే స్పూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలలోను 130 కులాలను అన్ని రంగాల్లో సామాజికంగా ఆర్ధికంగా, రాజకీయంగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. బీసీ కులాల జనభా దామాషా ప్రకారం ఆర్ధిక అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీకి బీసీ లే అండగా ఉన్నారనే కక్షతోనే గత ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బీసీ కార్పోరేషన్ ను నిర్వీర్యం చేయటంతో పాటు, బీసీ కులాల వారిని ఉక్కుపాదంతో అణచివేశారన్నారు. 2014-19 లో ప్రభుత్వం మంజూరు చేసిన బీసీ హాస్టల్స్, బీసీ భవన్ ల నిర్మాణాలను నిలిపివేశారన్నారు. అటువంటి పరిస్థితులలో బలహీన వర్గాలు తలెత్తుకు తిరిగేందుకు మరలా తెలుగు దేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలకు సముచిత స్థానం ఇచ్చి బీసీ వర్గాలకు చెందిన వారికి కీలకమైన మంత్రి పదవులు ఇచ్చారన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా , రాష్ట్ర డీజీపీగా ,రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ని సైతం బీసీ వర్గాల వారిని నియమించిన ఘనత చంద్రబాబు కు చెందుతుందన్నారు. రాష్ట్రంలో బీసీలకు ఉద్యోగ, ఉపాధి, సామాజిక, రాజకీయాలలో సమాన అవకాశాలు కల్పించేలా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామన్నారు.
రాష్ట్ర ఎంఎస్ఎంఈ , సెర్ఫ్ , ఎన్ ఆర్ ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల అభ్యున్నతికి బడ్జేట్ లో రూ.39,000 కోట్లు కేటాయించిందన్నారు. గత ప్రభుత్వం బీసీల సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేసిందని, ఆదరణ పధకం క్రింద పనిముట్లు అందించలేదని, బీసీ హాస్టల్స్ , సబ్ ప్లాన్ నిధులు నిలిపివేసిందన్నారు. చట్టసభల్లో బీసీలకు ఉన్న రిజర్వేషన్లు తగ్గించిందని, తిరిగి బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు తెచ్చే దిశగా ఈ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు.
ఆర్దికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం , చేనేత శాఖ మంత్రి ఎస్ సవిత మాట్లాడుతూ బీసీలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ పూర్తి అండగా ఉంటుందన్నారు. పార్టీ అధికారంలో లేని సమయంలో అచ్చెన్నాయుడు పార్టీకి అండగా ఉండి నడిపించారని, వైసిపి ప్రభుత్వం తనపై 24 కేసులు పెడితే..నీ వెనుక నేనున్నానని అచ్చెన్నాయుడు ధైర్యం చెప్పారన్నారు. బీసీ కార్పోరేషన్లను నిర్వీర్యం చేసిన బీసీల ద్రోహి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. బీసీలలో ప్రతి కుటుంబం నుంచి ఒకరిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దటానికి ప్రభుత్వం అవసరమైన అన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. మెగా డీఎస్సీ కి 26 జిల్లాలలో బీసీ స్టడీ సర్కిల్ ద్వారా శిక్షణ అందిస్తున్నామని, బీసీ హాస్టల్స్, బీసీ భవనాలు నిర్మాణానికి ముఖ్యమంత్రి ఆదేశాలతో చర్యలు తీసుకుంటున్నామన్నారు. బీసీల రాజకీయ, ఆర్ధిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
శాసనమండలి సభ్యులు దువ్వారపు రామారావు, శాసనసభ్యులు గళ్ళా మాధవి, మహ్మద్ నసీర్ అహ్మద్, బూర్ల సీతారామాంజనేయులు, తెనాలి శ్రావణ కుమార్, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ళ సత్యనారాయణ మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రాక మునుపు బీసీలకు ఎటువంటి ఆదరణ లేదని ఎన్టీఆర్ అధికారంలోకి రాగానే బీసీలకు పెద్దపీట వేసి రాజకీయంగా ఎదిగేందుకు అవకాశాలు కల్పించారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీలను సామాజికంగా, రాజకీయంగా, ఆర్ధికంగా బలోపేతం చేసేలా అవసరమైన పథకాలు అమలు చేస్తున్నారన్నారు. బీసీ కార్పోరేషన్ ఎర్పాటు చేసి బీసీలు ఆర్థికంగా నిలదొక్కుకునేందు అవకాశం కల్పించారన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీలను విస్మరించారన్నారు. బీసీలు అంతా సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధించవచ్చన్నారు. రాజకీయాలు ఒక కుటుంబానికే కాదు దామాషా ప్రకారం అందరికీ చెందాలని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించారన్నారు. జనాభా లో సగం ఉన్న బీసీలను చంద్రబాబు నాయుడు ముందుకు నడిపిస్తున్నారు. సూపర్ సిక్స్ పథకాలు ద్వారా రాష్ట్ర ప్రజలకు ఈ కూటమి ప్రభుత్వం మేలు చేస్తుందన్నారు.
అనంతరం బీసీ సాధికారిక కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సభలో కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన నాయుడు, రాష్ట్ర వ్యవసాయ, పశు సంవర్ధక, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత, రాష్ట్ర హౌసింగ్, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి, రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, శాసనమండలి సభ్యులు దువ్వారపు రామారావు, శాసనసభ్యులు గళ్ళా మాధవి, మహ్మద్ నసీర్ అహ్మద్, బూర్ల సీతారామాంజనేయులు, తెనాలి శ్రావణ కుమార్ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ళ సత్యన్నారాయణ లను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, మాజీ డిప్యూటీ మేయరు తాడిశెట్టి మురళీమోహన్ కార్యక్రమ నిర్వహణ కమిటీ కన్వీనర్ బండపల్లి శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు , కూటమి నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వాసన్య మహిళా మండలి విజ‌య‌వాడ

-“అహింసావాది మహాత్మాగాంధి ” విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహాత్మా గాంధీ స్మృతి దినం సందర్భంలో నాస్తికకేంద్రంలోని బాపూదర్శన్లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *