Breaking News

ప్రతి సమస్యను పరిష్కరించేందుకు సర్కిల్ పరిధిలో కోఆర్డినేషన్ మీటింగ్

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమస్య చిన్నదైనా, పెద్దదైన ప్రతి సమస్యను పరిష్కరించాలని, సర్కిల్ పరిధిలో గల వార్డ్ సచివాలయం సిబ్బంది సమన్వయంతో పని చేసేందుకు కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించాలన్న విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు సర్కిల్ 2 పరిధిలో గల వార్డ్ 24 నందు 91 ,92 వార్డు సచివాలయం, IGMC కాంప్లెక్స్ నందు వార్డు సచివాలయ సిబ్బంది తో జోనల్ కమిషనర్ కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో వార్డ్ 24 నందు వార్డు సచివాలయ సిబ్బందికి ఫీల్డ్ లెవెల్ లో గల సమస్యలు తెలుసుకుని వాటికి తగిన పరిష్కారము కొరకు చర్చించారు. సెక్రటరీలందరూ ఒకరితో ఒకరు సమన్వయం చేసుకొని ప్రతి సమస్యను పరిష్కరించాలని అధికారులు అన్నారు. ఈ మీటింగ్ లో జోనల్ కమీషనర్ -II ప్రభు దాసు , వార్డు స్పెషల్ ఆఫీసర్ M రాజా (SFO ) , DyEE ఈశ్వర్ రెడ్డి గారు తదితర అధికారులతో పాటు 24 వ వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజన్‘కు – విధ్వంసానికి తేడా ప్రజలు తెలుసుకోవాలి… : రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత 5 ఏళ్ళుగా టిడ్కో ఇళ్ళను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే అభిప్రాయం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *