విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి ఇంటికి వారి ఇంటి పైనే సౌరశక్తి పెట్టుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని శుభసంకల్పంతో కేంద్ర ప్రభుత్వం వారి ప్రధానమంత్రి సూర్య ఘార్ ముత్తు బిజిలి యోజన ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా ఆదేశాల, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సూచనల మేరకు మంగళవారం ఉదయం సర్కిల్ 1 పరిధిలో భవానిపురం శివాలయం సెంటర్ నుండి స్వాతి థియేటర్ వరకు, సర్కిల్ 2 పరిధిలో బి ఆర్ టి ఎస్ రోడ్డు నుండి గవర్నమెంట్ ప్రెస్ వరకు ర్యాలీను నిర్వహించారు.
ఈ ర్యాలీ ద్వారా ప్రజలకు సౌర్య విద్యుత్ ద్వారా కలిగే ప్రయోజనాలు, విద్యుత్ ఆదా, కేంద్ర ప్రభుత్వం పథకం ద్వారా వస్తున్న సబ్సిడీ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సూర్యగర్ ముఫ్త్ బిజిలి యోజన ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులు ఇంటికి వెళ్లి వారిని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మరియు ఆర్డీవో కే చైతన్య, కార్పొరేటర్లు శర్వాణి మూర్తి, గుడివాడ నరేంద్ర రాఘవ, జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రామ కోటేశ్వరరావు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.