Breaking News

“పరిశ్రమ ఆధారిత స్కిల్ ట్రైనింగ్ అండ్ ప్లేసెమెంట్ డ్రైవ్”

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
నైపుణ్యాల అభివృద్ధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు పరిశ్రమల నందు శిక్షణ తో కూడిన ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది. 31.01.2025 శుక్రవారం మచిలీపట్నం లోని బైపాస్ రోడ్ నందు గల కృష్ణవేణి ఐ.టి.ఐ కళాశాల నందు “పరిశ్రమ ఆధారిత స్కిల్ ట్రైనింగ్ అండ్ ప్లేసెమెంట్ డ్రైవ్” నిర్వహించనున్నట్లు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ డి.కె. బాలాజీ, ఐఏఎస్  తెలియజేసారు.

ఈ “స్కిల్ ట్రైనింగ్ అండ్ ప్లేసెమెంట్ డ్రైవ్” లో హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్ మరియు మిత్ర ఆటో ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్(మారుతీ డీలర్స్) వంటి ప్రముఖ కంపెనీల వారు పాల్గొంటున్నారని జిల్లా ఉపాధి కల్పన అధికారి డి. విక్టర్ బాబు గారు మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి Dr పి.నరేష్ కుమార్ తెలిపారు.
ఈ కంపెనీ లలో గల ఉద్యోగాలకు ఇంటర్, డిగ్రీ, ఐటిఐ(ఫిట్టర్), డిప్లొమా(మెకానికల్), బి.టెక్(మెకానికల్, ఈఈఈ), M.Sc (కెమిస్ట్రీ) పూర్తిచేసిన 18 నుండి 25 సంవత్సరాలలోపు యువకులు మాత్రమే అర్హులని, ఎంపిక అయిన వారికి ఆసక్తికర వేతనముతో పాటు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కలవని జనవరి 31న నిర్వహించబోయే “స్కిల్ ట్రైనింగ్ అండ్ ప్లేసెమెంట్ డ్రైవ్” కు హాజరయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు APSSDC సంస్థ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి Dr పి.నరేష్ కుమార్ తెలిపారు.

ఆసక్తి మరియు తగిన అర్హతలు గల అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in/user-registration లింక్ నందు తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ అయ్యి, రెజ్యూమె లతో లేదా బయోడేటా ఫోరమ్ లతో పాటు ఆధార్ మరియు సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో రావాలని, మరిన్ని వివరాలకు 99664 89796 నంబర్ను సంప్రదించాలని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజన్‘కు – విధ్వంసానికి తేడా ప్రజలు తెలుసుకోవాలి… : రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత 5 ఏళ్ళుగా టిడ్కో ఇళ్ళను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే అభిప్రాయం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *