Breaking News

డి&ఓ ట్రేడ్ లైసెన్స్ లపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో వార్డ్ సచివాలయాల వారీగా డి&ఓ ట్రేడ్ లైసెన్స్ లపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని, తమ రోజువారీ పర్యటనల్లో ట్రేడ్ లైసెన్స్ లను కూడా తనిఖీ చేస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ప్రజారోగ్య అధికారులు, కార్యదర్శులకు స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ వసంతరాయపురం, శారదా కాలనీ, రెడ్డిపాలెం, ఇన్నర్ రింగ్ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, మస్టర్ పాయింట్స్ తనిఖీ, పారిశుధ్య పనులు, అభివృద్ధి పనులను పరిశీలించి, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత వసంతరాయ పురం మస్టర్ పాయింట్ ని తనిఖీ చేసి, కార్మికుల, కార్యదర్శుల హాజరుని పరిశీలించి, సెలవుల రిజిస్టర్ లేక పోవడం గమనించి, తక్షణం రిజిస్టర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజారోగ్య కార్మికులకు ఇప్పటికే డెప్యుటేషన్లు రద్దు చేశామని, వారికి ఎఫ్ఆర్ఎస్ ద్వారానే జీతాలు ప్రాసెస్ చేయాలని స్పష్టం చేశారు. కార్యదర్శులు మస్టర్ సమయానికి విధులకు రావాలని, పారిశుధ్య నిర్వహణ విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సచివాలయం వారీగా వ్యాపార సంస్థలు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ కల్గి ఉండాలని, ఉన్న వారు రెన్యువల్ చేసుకునేలా కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మలేరియా డివిజన్ మస్టర్ ని పరిశీలించి, కేటాయించిన ప్రాంతాల్లో యాంటీ మలేరియా యాక్టివిటి చేపట్టాలని కార్మికులకు తెలిపారు. వసంతరాయ పురం రిజర్వాయర్ ని పరిశీలించి, నిర్దేశిత గడువు మేరకు ప్రతి నెల రిజర్వాయర్ ని శుభ్రం చేయాలని ఏఈని ఆదేశించారు.
అనంతరం రెడ్డిపాలెం రోడ్ విస్తరణ పనులను తనిఖీ చేసి, త్వరలో శంకర్ విలాస్ ఆర్ఓబి పనులు ప్రారంభించడం జరుగుతుందని, పనుల వలన ట్రాఫిక్ రెడ్డిపాలెం రోడ్ కి మళ్లించే అవకాశం ఉన్నందున విస్తరణ పనులు వేగంగ చేపట్టాలని పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. విస్తరణ పనులు క్లియర్ గా జరిగిన ప్రాంతంలో రోడ్ నిర్మాణ పనులను చేపట్టాలని ఈఈ ని ఆదేశించారు.
పర్యటనలో సిఎంఓహెచ్ డాక్టర్ అమృతం, సిటి ప్లానర్ రాంబాబు, డిసిపి సూరజ్ కుమార్, డిఈఈలు కళ్యాణరావు, రమేష్ బాబు, ఏసిపి మల్లికార్జున, ఆర్ఓ రవి కిరణ్ రెడ్డి, ఎస్ఎస్ ఆయుబ్ ఖాన్, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజన్‘కు – విధ్వంసానికి తేడా ప్రజలు తెలుసుకోవాలి… : రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత 5 ఏళ్ళుగా టిడ్కో ఇళ్ళను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే అభిప్రాయం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *