Breaking News

ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కలసి పనిచేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు చేసి జిల్లాను అన్నిరంగాలలో సర్వతోముఖాభివృద్దిగా చేసి అగ్రగామిగా నిలిపేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కలసి పనిచేయాలని జిల్లా ఇన్ చార్జ్ మంత్రి మరియు పర్యాటక, సాంస్కృతిక , సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్ లోని ఎస్ఆర్ శంకరన్ హాలులో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్ చార్జ్ మంత్రి మరియు పర్యాటక, సాంస్కృతిక , సినియాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, పౌర సరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ , శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ, రాజ్యసభ సభ్యులు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, శాసనమండలి సభ్యులు కె ఎస్ లక్మణరావు, చంద్రగిరి ఏసురత్నం, టి. కల్పలతా రెడ్డి , మురుగుడు హనుమంతరావు, శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు, ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ , తెనాలి శ్రావణ కుమార్, గళ్లా మాధవి, మహమ్మద్ నసీర్ అహ్మద్, సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ తేజ, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా, అసిస్టెంట్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ జగన్నాధ్ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో వ్యవసాయ అనుబంధ శాఖలు, ఇండస్ట్రీయల్, స్కిల్ డెవల్మేంట్, హౌసింగ్, జిల్లా నీటి యాజమన్య సంస్థ, రహదారులు భవనాలు శాఖ, వైద్యారోగ్య శాఖ, విద్యాశాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖ, డీఆర్డీఏ, మెప్మా, టూరిజం తదితర అజెండా అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ చార్జ్ మంత్రి మరియు పర్యాటక, సాంస్కృతిక , సినియాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్దికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నూతన విధానంతో సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను ముందుకు తీసుకువెళుతున్నారన్నారు. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సహకారంతో ప్రభుత్వం రాజధాని పనులు త్వరలోనే పూర్తి చేస్తుందని దీనితో జిల్లాలోని ప్రజలా జీవన ప్రమాణాలు పెరుగుతాయన్నారు. ప్రజాప్రతినిధులు సంక్షేమ పధకాల అమలును క్షేత్ర స్థాయిలో పరిశీలించిన , గుర్తించిన అంశాలను మరింతగా మెరుగుపర్చేలా అధికారులు పనిచేయాలన్నారు. అప్పుడే సంక్షేమ పథకాల లక్ష్యం నెరవేరి అభివృధ్ది సాధ్యం అవుతుందన్నారు.
సమావేశంలో అజెండా అంశాలపై జరిగిన చర్చ సంధర్భంగా జిల్లా ఇన్ చార్జ్ మంత్రి మరియు పర్యాటక, సాంస్కృతిక, సినియాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. ఈ అంశంలో అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులతో సమన్వయము చేసుకోవాలని సూచించారు.. ప్రభుత్వ సంక్షేమ గణంకాలను స్థానిక ప్రజాప్రతినిధులకు తెలపడం ద్వారా ప్రభుత్వం ప్రజలకు ఎంత సంక్షేమం అందిస్తుందో తెలుస్తుందన్నారు. రెవిన్యూ, వ్యవసాయ శాఖ, బ్యాంకర్లు సమన్వయంతో వ్యవహరించి కౌలు రైతులకు రుణాలు అందించాలని ఆదేశించారు. కౌలు రైతుల రక్షణ కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తుందని త్వరలోనే ప్రభుత్వం కౌలు రైతుల కోసం కొత్త చట్టం తెస్తుందన్నారు. సీసీఆర్సీ కార్డులు ఉన్న కౌలు రైతులకు రుణాల విషయంలో బ్యాంకర్లు రైతులకు రుణాలు ఖచ్చితంగా మంజూరు చేయాలని, మార్చి 15 లోగా కౌలు రైతు రుణాలకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిచేయాలన్నారు. పీఎంఏవై క్రింద రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో అందించే గృహాలను త్వరితగతిన ఇళ్ళ నిర్మాణాలు పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి లో చాలా ప్రాంతాలనుండి వైద్యం కోసం వచ్చే పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడంలో వైద్యులు కృషి చేయాలన్నారు. జిల్లాలో గుంతలరహిత రహదారులను తీర్చిదిద్దేందుకు మంజూరు చేసిన పనులకు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. గడిచిన ఐదేళ్లలో తట్టెడు మట్టి కూడ గత ప్రభుత్వం వేయలేదని నూతన రహదారులు వేయటానికి అవసరం అయిన నిధుల కోసం కృషి చేస్తామన్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అర్హులకు మాత్రమే పంట నష్టపరిహారం అందించేలా వ్యవసాయశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అనర్హులకు పంట నష్టపరిహారంను అందించే వారిపై కఠిన చర్యలు తీసుకునే విధానంను వ్యవసాయశాఖలో తీసుకురావాలన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాది కల్పించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం జారీ చేసిన ఇండస్ట్రీయల్ పాలసీ పై అవగాహన కల్పించేలా పరిశ్రమల శాఖ అధికారులు కార్యక్రమాలు రూపొందించాలన్నారు. ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన పాలసీలపై ప్రజాప్రతినిధులను బాగస్వాములను చేస్తూ జిల్లా స్థాయిలో కాన్ఫరెన్స్ లు నిర్వహించాలన్నారు. పీపీపీ విధానంలో పర్యాటక శాఖ సందర్శకులు వచ్చే అన్ని దేవాలయాలు, దర్గాలు, చర్చిలను పర్యాటక సర్క్యట్ లో అనుసంధానం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశంలో నిర్వహించే రీజినల్ సెమినర్ లో జిల్లా సమగ్ర పర్యాటక అభివృద్దికి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా స్థాయిలో పర్యాటక శాఖ అభివృద్దికి ఉత్సవం నిర్వహణకు ప్రణాళిక రూపొదించుకొని పనిచేయాలన్నారు.
రాష్ట్ర పౌర సరఫరాలు , వినియోగదారుల వ్యవహారల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ సీసీఆర్సీ కార్డులు ఇచ్చిన వారందరికీ రుణాలు మంజూరు చేసేలా నియోజకవర్గంవారీగా డ్రైవ్ చేపట్టాలన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసే వారిని ఉక్కుపాదం తో అణచివేసేలా కేసులు నమోదు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 1.48 కోట్ల తెల్ల రేషన్ కార్డులు, 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్ లు ఉన్నాయన్నారు. వీటిని అనుసంధానం చేయకపోవడం వల్ల 8 లక్షల గ్యాస్ కనెక్షన్ లు అధికంగా ఉన్నట్లు గుర్తించామన్నారు.. వచ్చే వారంలో గ్రామ, వార్డు సచివాలయాలకు ఈ బాధ్యత అప్పగించి సమస్యను పరిష్కారిస్తామన్నారు.రాష్టంలో 87 లక్షల పై చిలుకు గ్యాస్ సిలిండర్ లు లబ్ధిదారులకు అందించామన్నారు. గుంటూరు జిల్లాలో 3.83 లక్షల ఉచిత గ్యాస్ సిలిండర్ లు పంపిణీ చేశామన్నారు..అంతిమంగా ఎక్కువ మంది వినియోగదారులకు లబ్ధి చేకూర్చాలన్నదే ప్రభుత్వ ధ్యేయం అన్నారు..రేషన్ వాహనాల (MDU) విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటినిమరింత సమర్దవంతంగా ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై చర్చిస్తామన్నారు.
శాసన మండలి చీఫ్ విప్ పంచుమూర్తి అనురాధ మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం పరిధిలో రైతులకు సాగునీరు సక్రమంగా అందించేలా కె డబ్ల్యు కెనాల్ మరమ్మత్తులు పనులు చేపట్టాలన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని రహదారుల మరమ్మత్తు పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.
జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ మాట్లాడుతూ కౌలు రైతులకు రుణాలు మంజూరు చేసేలా లీడ్ బ్యాంక్ మేనేజరు, వ్యవసాయశాఖ బ్యాంకర్లను సమన్వయం చేసుకొని నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలన్నారు. దుగ్గిరాలలో శుభం కోల్డ్ స్టోరేజీ అగ్నిప్రమాదంలో నష్టపోయిన పసుపు రైతులకు పరిహారం ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దలన్న లక్ష్యంతో అమలు చేస్తున్న ఇండస్ట్రీపాలసీపై అవగాహన కోసం సంబంధిత శాఖలతో జిల్లా స్థాయిలోను, నియోజకవర్గంలో ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేసి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలపై అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోని నివేదికలు అందించాలన్నారు.
రాజ్యసభ సభ్యులు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ శాఖల వారీగా ప్రాధాన్యత అంశాలపై ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేస్తే సాధ్యమైనంత వరకు సమస్యలు పరిష్కరించాలన్నారు.
శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణ రావు మాట్లాడుతూ కౌలు రైతులకు బ్యాంకులు రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని, నకిలీ విత్తనాలు విక్రయాలు , పురుగుమందులు విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, గుంటూరు ఛానల్ ఆధునీకరణ, పొడిగింపు పనులకు అవసరమైన భూసేకరణకు నిధుల మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. అభ్యంతరం లేని భూముల్లో నివాసాలు పట్టాలు ఇవ్వాలని, బీ ఫారమ్ స్థలాలకు పట్టాలు ఇవ్వాలన్నారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ సమయంలో నగరంలో ట్రాఫిక్ రద్దీ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
శాసన మండలి సభ్యులు టి.కల్పలతా రెడ్డి మాట్లాడుతూ డోలాస్ నగర్ లోని నివాసం ఉంటున్న వారికీ పట్టాలు ఇచ్చే అవకాశం పరిశీలించాలన్నారు. మోడల్ ప్రైమరీ స్కూల్ విలీనంలో ఉర్ధూ స్కూల్స్ కు మినహాయింపు ఇవ్వాలన్నారు.
శాసన మండలి సభ్యులు చంద్రగిరి ఏసురత్నం రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేకంగా పౌర సరఫరాలో విజిలెన్స్ విభాగాన్ని బలోపేతం చేయాలన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్దికి పూర్వ విధ్యార్దుల సహకారం తీసుకోవాలన్నారు.
శాసన మండలి సభ్యులు మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ చేనేత కార్మికులు సమస్యలను పరిష్కరించేలా, ఆప్కో ఉత్పత్తులు కొనుగొలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
శాసన సభ్యులు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ దీపం 2 పథకంలో నగదు జమ లో ఇబ్బందులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మార్కెటింగ్ కమిటీలోని గౌడన్లను మరమ్మత్తులు చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
శాసన సభ్యులు తెనాలి శ్రావణ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను రెవెన్యూ, పోలీస్, పౌర సరఫరా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రేషన్ బియ్యం అమ్ముకునే లబ్ధిదారులకు కార్డులు రద్దు చేస్తామని నోటీసులు ఇవ్వాలన్నారు. మెడికొండూరు మండలంలో అనర్హులకు పంట నష్టపరిహారం అందించిన వ్యవసాయశాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తాడికొండ నియోజకవర్గం పరిధిలోని నాగార్జున సాగర్ కెనాల్ మరమ్మత్తు పనులు నిర్వహించాలన్నారు. టూరిజం సర్కుట్ లో హిందు దేవాలయాలతో పాటు జిల్లాలోని ప్రసిధ్ద దర్గాలు, చర్చిలను అనుసంధానం చేయాలన్నారు. కొండవీటి సర్కిల్ లో ఫిరంగిపురం కార్మెల్ మాతా చర్చిని చేర్చాలన్నారు.
శాసన సభ్యులు గళ్లా మాధవి మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ ప్రమాదాల నష్ట పరిహారం వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కృష్ణ నగర్ లోని రైతుబజార్ నిర్మాణం వెంటనే ప్రారంభించాలన్నారు. అప్పటి వరకు అక్కడ కనీస మౌళిక సౌకర్యాలు కల్పించాలన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నాణ్యమైన సేవలను అందించేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌళిక సౌకర్యాలైన మరుగుదొడ్ల, మంచినీరు సౌకర్యాలు కల్పించాలన్నారు.
శాసన సభ్యులు బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ ఎండీయూ వాహనాలు వచ్చిన తరువాత రేషన్ బియ్యం అక్రమ రవాణా ఎక్కువైందని, గతంలో ఉన్న విధంగా రేషన్ షాపుల్లోనే బియ్యం పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలపై జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులను బాగస్వాములను చేస్తూ ప్రత్యేకంగా వర్క్ షాపులు నిర్వహించాలన్నారు. ఎంఎస్ఎంఈ లలో ఉత్పత్తి చేసిన వస్తువులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్టార్ట్ అప్ కంపెనీల ఉత్పత్తుల అమ్మకాలకు కొన్ని నిబంధనలు సడలించాల్సిన అవసరం ఉందన్నారు. మౌలిక సౌకర్యాలు లేని హౌసింగ్ లే అవుట్లలో మంజూరు చేసిన ఇంటి పట్టాలు, నిర్మాణాలు ప్రారంభించన ఇళ్ళ పట్టాలను రద్దు చేసి ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పట్టణ ప్రాంతాల వారీకీ రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల వారీకీ మూడు సెంట్లు స్థలం అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
శాసన సభ్యులు మహ్మద్ నజీర్ అహ్మద్ మాట్లాడుతూ కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ప్రభుత్వ వాటాను పీపీపీ విధానంలో అందించే అవకాశాలను పరిశీలించాలన్నారు. కాకుమానువారితోట లో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అదనపు నిర్మాణాలకు ప్రభుత్వం నుంచి అనుమతులు త్వరగా మంజూరు చేయాలన్నారు.
సమావేశం అనంతరం జిల్లా ఇన్ చార్జ్ మంత్రి మరియు పర్యాటక, సాంస్కృతిక , సినియాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ విలేకరులతో మాట్లాడుతూ జిల్లా సమీక్ష సమావేశంలో వ్యవసాయం, విద్యా, వైద్యం, ఆరోగ్యం , హౌసింగ్, రహదారులు తదితర అంశాలపై పూర్తిస్థాయిలో ప్రజాప్రతినిధులతో చర్చించామన్నారు. ప్రజాప్రతినిదులు తెలియచేసిన పలు అంశాలు, సూచనలను పరిష్కార దిశగా స్పష్టమైన కార్యాచరణ రూపొందించుకొని జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామన్నారు. రానున్న రెండు నెలలు కాలంలో అన్నిశాఖల అభివృద్ధి పనులు, ఇతర కార్యక్రమాల అమలుపై చర్చించి సూచనలను అందించటం జరిగిందన్నారు. ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దీపం 2 , తదితర పధకాలను క్షేత్రస్థాయిలో మరింత మెరుగ్గా అమలుకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయటం జరిగిందన్నారు. మిర్చిలో నల్లి పురుగు నివారణకు అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలను వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అందిస్తున్నారన్నారు.
సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజన్‘కు – విధ్వంసానికి తేడా ప్రజలు తెలుసుకోవాలి… : రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత 5 ఏళ్ళుగా టిడ్కో ఇళ్ళను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే అభిప్రాయం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *