గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకము సౌజన్యంతో ది.20.01.2025 నుండి ది.31.01.2025 వరకు జరుగుచున్న పశు వైద్య శిబిరములలో భాగముగా ఈరోజు అనగా ది.28.01.2025 నవెటర్నరీ పాలీ క్లినిక్ గుంటూరు వారు గుంటూరు పట్టణము నెహ్రనగర్ లోని గోసంరక్షణసంఘం వారి గోశాలలో నట్టల నివారణ కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 656 ఆవులకు మరియు 155 దూడలకు నట్టల నివారణ మందు త్రాగించారు.ఈ కార్యక్రమాన్ని గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా.ఓ. నరసింహారావు, వెటర్నరీపాలీ క్లినిక్ డిప్యూటీ డైరెక్టర్ డా. ఎం. రత్నజ్యోతి, డివిజనల్ డిడి డా.కె.వి.వి. సత్యనారాయణ,శివరాం-రాష్ట్ర జంతు సంరక్షణ సంఘ అధ్యక్షులు, నెహ్రనగర్ గోసంరక్షణ సంఘం వైస్ ప్రెసిడెంట్ యార్లగడ్డ వీర శేఖర్ గారు, నెహ్రనగర్ గోసంరక్షణ సంఘం కార్యనిర్వాహణ కార్యదర్శి-రాజు, పాటిబండ్ల బలరాం -జిల్లా టిడిపి ఉపాధ్యక్షులు, వేములకొండ శ్రీనివాసరావు -జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు, సోమశేఖర్ -డివిజన్ ప్రెసిడెంట్ మరియు బత్తిన శేఖర్ గౌడ్,-గౌడ సాధికార జిల్లా అధ్యక్షులు కూడా పాల్గొన్నారు.
డాక్టర్ రత్నజ్యోతి గారు మాట్లాడుతూ గుంటూరు పట్టణంలో పశువైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని ఈ శిబిరాలలో రక్త పరీక్షలు పేడ పరీక్షలు చేస్తూ తగు చికిత్స చేస్తున్నామని తెలియజేశారు.పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల వారు నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు.
ఈ శిబిరంలో అసిస్టెంట్ డైరెక్టర్స్ డా . యల్. నాగేశ్వరావు, డా.పి. చక్రవర్తిగారు, డా. జగదీష్ బాబు, డివిజనల్ ఏడి ఆర్. శ్రీనివాసరావు, ఏ.డి.డి.యల్ డా. లావణ్య, పారా సిబ్బంది అటెండర్స్ పాల్గొన్నారు.
Tags guntur
Check Also
విజన్‘కు – విధ్వంసానికి తేడా ప్రజలు తెలుసుకోవాలి… : రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత 5 ఏళ్ళుగా టిడ్కో ఇళ్ళను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే అభిప్రాయం …