గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు మాస వారి తనిఖీలలో భాగంగా సోమవారం ఉదయం గుంటూరు కలక్టరేట్ ఆవరణలోని ఇవియంలు భద్రపరిచిన గోడౌన్ ను జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ తనిఖీ చేసారు. సీసీ టీవి పనితీరు , అగ్నిమాపక పరికరాలను పరిశీలించారు. గోడౌన్ వద్ద భద్రత సిబ్బంది లాగ్ బుక్ ను పరిశీలించారు. అగ్నిమాపక పరికరాలపై ఎక్స్ పైరీ తారీఖు దగ్గర పడుతున్నందున సకాలంలో తగు చర్యలు తీసుకోవాలని జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస రెడ్డిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇవియంల భద్రత విషయంలో రాజీపడకుండా అవసరమైన అన్ని భద్రతా చర్యలు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామంలో వ్యవసాయ మార్కెట్ లో వీవీపాట్స్ భద్రపరచిన గోడౌన్ ను డిప్యూటీ కలెక్టర్ గంగరాజు ( ఇన్ చార్జ్ గుంటూరు ఆర్డీఓ ) సీసీ టీవీ పనితీరు , అగ్నిమాపక పరికరాలను పరిశీలించారు. వీవీప్యాట్స్ భద్రత విషయంలో అవసరమైన అన్ని భద్రతా చర్యలు పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించారు.
కలక్టరేట్ ఇవియం ల పరిశీలనలో డిఆర్ఓ షేక్. ఖాజావలి, డిప్యూటీ కలెక్టర్ గంగరాజు ( ఇన్ చార్జ్ గుంటూరు ఆర్డీఓ ) , జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస రెడ్డి , ఈఈ ఆర్ అండ్ బి విశ్వనాధ రెడ్డి , కలక్టరేట్ హెచ్ సెక్షన్ పర్యవేక్షకులు మల్లేశ్వరి , ఫిరంగిపురం వీవీపాట్స్ పరిశీలనలో ఫిరంగిపురం తహశీల్దార్ జె. ప్రసాద రావు , రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.