విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయంత 2.0 (భారత సైన్యంలో మొదటి స్వదేశీయుద్ధట్యాంకు) పేరుతో విజయవాడలోని పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల బాలికల ఎన్.సి.సి. బెటాలియన్ (4ఎ) ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు క్రీడలు, ఇతర పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. నగరంలోని 14 స్కూళ్లు, ఆరు కాలేజీల నుంచి 537 మంది విద్యార్థులు పాల్గొన్నారు. రన్నింగ్, త్రోబాల్, పోకో, టగ్ ఆఫ్ వార్ తదితర క్రీడాంశాల్లో జరిగిన పోటీల్లో ఓవరాల్ మొదటి బహుమతి నలంద కళాశాల, రెండో బహుమతి రామవరప్పాడులోని జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు గెలుచుకున్నారు. డ్రిల్, పోస్టర్ పెయింటింగ్ పోటీల్లో మేరిస్ స్టెల్లా కాలేజి, వక్తృత్వం, ఫ్లాగ్ ఏరియా పోటీల్లో నలంద కాలేజి, సోలో డాన్స్ లో లక్కిరెడ్డి బాలిరెడ్డి కాలేజీ , గ్రూప్ సింగింగ్ పోటీల్లో రామవరప్పాడు జడ్పీ స్కూలు, గ్రూప్ డాన్స్ లో గొల్లపూడి ఎట్కిన్సన్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు.
ముఖ్య అతిథి కమాండింగ్ ఆఫీసర్ (4 ఏ–గాళ్స్ బెటాలియన్) కల్నల్ బలిందర్ సింగ్, ఇన్ విక్టా కెరీర్ కన్సల్టెన్సీ వ్యవస్థాపకులు జొన్నలగడ్డ వివేకానందమూర్తి, గణేష్ గిఫ్ట్స్ అధిపతి గణేష్, ఎపెక్స్ కన్సల్టెన్సీకి చెందిన దీపిక, ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్, డైరెక్టర్ వేమూరి బాబురావు, డీన్ ఆచార్య రాజేష్ సి. జంపాల బహుమతులు అందజేశారు. విజయంత కన్వీనర్, బాలికల బెటాలియన్ (4ఎ) ఎ.ఎన్.ఒ. లెఫ్టినెంట్ డాక్టర్ సిహెచ్.వి. రోహిణికుసుమ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.