-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాబోయే రెండు నెలల్లో బీసీ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు వినియోగంలో నిర్లక్ష్యం చూపొద్దని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆదేశించారు. మంగళవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ, డైరెక్టర్ మల్లికార్జున, ఇతర అధికారులతో మంత్రి సవిత సమీక్షా సమావేశం నిర్వహించారు. హాస్టళ్ల మరమ్మతులు, విద్యార్థులకు అవసరమైన ట్రంకు పెట్టెలు, దుప్పట్లు, ఇతర అవసరాలకు కేటాయించిన నిధులు ఏయే మేర వినియోగించారో…జిల్లాల వారీగా మంత్రి అడిగి తెలుసుకున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరం మరో రెండు నెలల్లో ముగియనుందని, బడ్జెట్ లో కేటాయించిన నిధులు సకాలంలో వినియోగించాలని స్పష్టం చేశారు. రాబోయే బడ్జెట్ లో పొందుపర్చాల్సిన అంశాలపైనా ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలని కార్యదర్శి సత్యనారాయణ మంత్రి సవిత ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ జేడీ చంద్రశేఖర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
మంత్రి సవిత ను ఎమ్మెల్యేలు
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితను ఎమ్మెల్యేలు కేఈ శ్యాంబాబు, కూన రవికుమార్, ఎమ్మెస్ రాజు తో పాటు మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి కలిశారు. తమ నియోజక వర్గాల్లో బీసీ భవన్ల నిర్మాణంతో పాటు హాస్టళ్ల మరమ్మతుల నిధుల కేటాయించాలని కోరారు. వెనుకబడి తరగతుల అభివృద్ధి కోసం విరివిగా స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయాలని వారు మంత్రి సవితను కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.