విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బిజెపి రాజ్యసభ ఎంపి ఆర్.కృష్ణయ్య మర్యాదపూర్వకంగా ఎంపి కేశినేని శివనాథ్ ను మంగళవారం గురునానక్ కాలనీలోని ఆయన కార్యాలయంలో కలిశారు. ఆర్.కృష్ణయ్యకి సాదర స్వాగతం పలికిన ఎంపి కేశినేని శివనాథ్ శుభాకాంక్షలు తెలపటంతో పాటు శాలువాతో సత్కరించి శ్రీ వెంకటేశ్వర స్వామి పత్రిమను బహుకరించారు.
ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి, ఎపి బిసి సంక్షేమ సంఘం ఇన్ చార్జ్ యలగాల నూకాలమ్మ, కృష్ణ జిల్లా బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు నమ్మి భాను ప్రకాష్ యాదవ్, విజయవాడ బిసి సంఘం అధ్యక్షుడు తనిశెట్టి లక్ష్మణరావు, రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి పట్నాల హరిబాబు, సీనియర్ బిసి నాయకులు మారేష్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.