Breaking News

ఈనెల 31వ తేదిన జరిగే శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

-పెనుగొండ ఆలయంలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం
-ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మెన్ డూండి రాకేష్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మాఘ శుద్ధ విదియ అనగా ఈనెల 31 వ తేదిన పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని పెనుగొండనందలి శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. స్థానిక నాయకులు కూడా పాల్గొని అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ పిలుపునిచ్చారు. కుల, మత, ప్రాంతీయాలకు అతీతంగా ఈ వేడుకలు జరపాలన్నారు.

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… జగన్ ఆర్యవైశ్య పదం వినపడితే చాలు చిరాకుపడిపోయేవాడు. ఆర్యవైశ్య నాయకులన్నా, ఆర్యవైశ్య సంఘాలన్నా పట్టించుకోలేదు, వారి విన్నపాలను జగన్ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ప్రభుత్వంలో ఆర్యవైశ్య పదమే లేకుండా చేసి ముందుకెళ్లింది. అందుకు నిరసిస్తూ ఆర్యవైశ్యులు అనేక ఉద్యమాలు, పోరాటాలు చేశారు. పార్టీలకు అతీతంగా రోడ్లపైకి వచ్చారు. వైసీపీ హయాంలో గుడులు, గుడులలోని సిబ్బందిని, సంఘాలను ఇబ్బంది పెట్టారు. సత్రాలను కూల్చారు. ఆర్యవైశ్యుల వ్యాపారాలపై దెబ్బతీశారు. ఆర్యవైశ్యులను చిత్రహింసలకు గురిచేశారు. వారిని పీల్చి పిప్పి చేశారు.

ఆనాడు చంద్రబాబు ఆదేశాలతో యువనాయకుడు లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అనేకచోట్ల వైశ్యులు ఏం కోరుకుంటున్నారు, వారికి ఏం కావాలి, వారి సమస్యలేంటి? ఎటువంటి చర్యలు తీసుకుంటే వారు బాగుపడతారు? వారి గౌరవాన్ని ఎలా పెంచాలి అని అన్వేషించారు, వారి విధానాలను మెచ్చుకున్నారు. వాణిజ్య వర్గాల్లో ఆనందం చోటు చేసుకోవడానికి ప్రణాళికలు రచించారు. వివిధ ప్రాంతాల్లో తిరిగి ఆర్యవైశ్యుల సమస్యలు తెలుసుకున్నారు. వైసీపీ ఇబ్బంది పెట్టినచోట్లల్లా పోరాటాలు చేసినట్లు గుర్తించారు. వీటన్నింటిపై రిపోర్టు తయారు చేసి లోకేష్ గారికి ఇచ్చాం. దాన్ని మేనిఫెస్టో కమిటీ పరిశీలించి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది.

ఆర్యవైశ్యుల కుల దేవత ఇలవేల్పు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఘనమైన చరిత్ర ఉంది. వెంకన్నస్వామికి పట్టువస్త్రాలు సమర్పించినట్లుగానే, విజయవాడ కనకదుర్గమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించినట్లుగానే ఆర్యవైశ్యుల ఇలవేల్పు అయిన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం రోజున ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. దీంతో ఆర్యవైశ్యులందరూ ఆనందపడతారు, గర్వంగా ఫీలౌతారు అని చంద్రబాబును కోరాము. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని పెనుగొండనందలి శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయం రెండు వేల 600 సంవత్సరాల చరిత్ర కలిగివుంది. నగరేశ్వరస్వామి ఆలయంలో కొలువైవున్న శ్రీ పెనుకొండ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయానికి మంచి పేరుంది. ఈ ఆలయంలో పట్టువస్త్రాలు సమర్పించాలని చంద్రబాబును కోరాము. ఆయన సహృదయంతో, ఆర్యవైశ్యులపై ఆయనకు ఉన్న గౌరవంతో అంగీకరించారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఆర్యవైశ్యులపై ఉన్న అభిమానాన్ని చాటుకుంది. ఆర్యవైశ్యుల అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని ఘనంగా ప్రభుత్వం నిర్వహించేట్లు మేనిఫెస్టోలో పెట్టడమేకాకుండా ఆనాడు చంద్రబాబు ఆదేశాల మేరకు పవన్ కల్యాణ్, లోకేష్ లు చర్చించి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని కేబినెట్ లో, అసెంబ్లీలో చర్చించారు. అధికారికంగా నిర్వహిస్తామని ప్రభుత్వం జీవో నెంబర్ 189ని విడుదల చేసింది. ఆర్యవైశ్య సంఘాలు, దేవాలయాలు 300కు పై చిలుకు అమ్మవారి ఆలయాలున్నాయి. ఈ ఆలయ భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఆర్యవైశ్యుల కోరిక మేరకు మాఘ శుద్ధ విది య ఈనెల 31 వ తేదిన వచ్చింది. ఈరోజునే అమ్మవారి విశ్వరూపం ఆవిర్భవించడం జరిగింది. ఆత్మార్పణ చేసుకుంటూ విశ్వరూపిణీ మాతగా తన నిజ స్వరూపం చూపించారు. అమ్మవారిగా కనపడడం జరిగింది. ఆరోజును రాష్ట్ర పండుగగా నిర్వహిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీన్ని మేమంతా స్వాగతిస్తున్నాం. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆర్యవైశ్య కుల సంఘాలన్నీ ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలుపుకున్నాం. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా నేడు ఈ వేడుకలు జరపాలి.

వైసీపీ పాలనలో ఆర్యవైశ్య సంఘాలు కోల్పోయిన గౌరవాన్ని కూటమి ప్రభుత్వం పెంచింది. వారి జీవితాల్లో వెలుగులు నింపింది. వివిధ ప్రాంతాల్లో నిర్వహించే ఈ కార్యక్రమాలకు స్థానిక నాయకులు కూడా పాల్గొని అమ్మవారి ఆశిస్సులు తీసుకోవాలి. అమ్మవారి ఆశిస్సులతో రాష్ట్రం సుబిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం.

వైసీపీ నిరంకుశ పాలన ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు కొన్ని వర్గాలను నడి రోడ్డుపై చీల్చి చెండాడారు. వారి మనుగడే లేకుండా చేశారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రజలకు చేరువైంది. ప్రజలకు ఏం కావాలో అది సమకూరుస్తోంది. వారి కాళ్ల మీద వారు నిల్చొనే విధంగా చేస్తోంది. వారు కోరుకునే విధంగా వారికి గౌరవమిస్తోంది. కటింగ్ మాస్టర్లు, స్క్రిప్ట్ మాస్టర్లు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపట్ల ప్రజలు హర్షిస్తున్నారు. అందరూ సుఖసంతోషాలతో ఉన్నారని ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజన్‘కు – విధ్వంసానికి తేడా ప్రజలు తెలుసుకోవాలి… : రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత 5 ఏళ్ళుగా టిడ్కో ఇళ్ళను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే అభిప్రాయం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *