Breaking News

వై.ఎస్.వెంకట్‌ రెడ్డి బైరైటీస్ గనుల లీజు ఎగ్జిక్యూషన్ నిలుపుదల

-లీజు మంజూరులో డీవియేషన్స్‌పై విచారణ జరిపి బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పులివెందుల నియోజకవర్గం వేముల మండలంలో విలువైన వైట్ బైరైటీస్ గనుల లీజు ఆర్డర్‌ను గనుల శాఖ డైరెక్టర్ తన విచక్షణాధికారంతో 15 జనవరి, 2025న ఇవ్వడం జరిగింది. సాధారణంగా మైనర్ మినరల్స్ అయినటువంటి.. రోడ్ మెటల్, గ్రానైట్, బైరైటీస్ వంటి ఖనిజాల మంజూరు మంత్రి అధికార పరిధిలోకి రావు. వై.ఎస్.జగన్ రెడ్డి బంధువు వై.ఎస్.వెంకట్ రెడ్డి బైరైటీస్ గనుల కేటాయింపు అనేది మంత్రి దృష్టికి తీసుకురాకుండా జారీ చేయడమైనది. క్వారీ లీజు అనుమతుల మంజూరు డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ వారి ప్రత్యేక విచక్షణాధికారం పరిధిలోనే ఉంటాయి. ఈ ప్రత్యేక అంశానికి సంబంధించి గనుల శాఖలో 24.05.2024న ఇచ్చిన గడువు అనుమతి నియమాలకు లోబడి చేయలేదని గుర్తించాం. గడువు దాటిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకట్ రెడ్డి అనుమతులిచ్చారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సన్నిహితంగా ఉంటూ, గత ప్రభుత్వంలో నియమింపబడి ప్రస్తుతం అదే హోదాలో కొనసాగుతున్న ఓ ముఖ్య అధికారి ఈ ఫైలును వేగంగా కదిలేలా చేసేందుకు సర్క్యులర్ జారీ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
ఈ అంశంపై పత్రికల్లో వచ్చిన వార్తలను పరిశీలించిన నేపథ్యంలో డీవియేషన్స్ గుర్తించి ఎగ్జిక్యూషన్ ఆర్డర్‌ను నిలపివేస్తూ మౌఖిక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ వ్యవహారంపై లోతుగా పరిశీలన చేసి బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోబడతాయి. సహజ సంపద కేటాయింపుల లేదా తద్వారా వచ్చే ఆదాయం ఏదైనా ప్రభుత్వానికి, ప్రజలకు చెందాలి తప్ప అక్రమార్కుల పరం కాకూడదనేది కూటమి ప్రభుత్వ విధానం.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజన్‘కు – విధ్వంసానికి తేడా ప్రజలు తెలుసుకోవాలి… : రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత 5 ఏళ్ళుగా టిడ్కో ఇళ్ళను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే అభిప్రాయం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *