Breaking News

ఎస్సీఈఆర్టీలో ఆన్ డ్యూటీ విధానంలో అసెస్మెంట్ నిపుణుల భర్తీకి ఆహ్వానం

-ఈ నెల 10వ తేదీ వరకు పొడిగింపు
-ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఎం.వి.కృష్ణారెడ్డి 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎస్సీఈఆర్టీలో పది అసెస్మెంట్ నిపుణుల (Assessment experts) ఖాళీలు భర్తీ చేయడానికి అర్హత గల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల నుండి ఆన్ డ్యూటీ ప్రాతిపదికన ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీఆర్టీ డైరెక్టర్  ఎం.వి.కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులు చేసుకోవడానికి ఈ నెల 10వ తేదీ వరకు గడువు పెంచినట్లు తెలిపారు. పూర్తి వివరాలు ఆర్జేడీలకు, జిల్లా విద్యాశాఖాధికారులకు పాఠశాల విద్యా సంచాలకులు  వి.విజయ్ రామరాజు IAS  ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. స్టేట్ అసెస్‌మెంట్ సెల్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి https://forms.gle/qFRjhWHMtVJ5UXUT8 లింక్‌పై క్లిక్ చేయాలని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *