విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జన శిక్షణ సంస్థాన్ వారు గడిచిన మూడు దశాబ్దాలుగా మహిళా పారిశ్రామివేత్తలను ప్రోత్సహించే ఉద్దేశంతో మహిళ ఉత్సవ్ పేరిట ఒక ప్రదర్శన మరియు అమ్మకాలతో కూడిన ఒక వేదిక ఉత్సావాన్ని నిర్వహిస్తు న్నామని, దీనిలో ఆసక్తి గల మహిళా పారిశ్రామిక వేత్తలు తమ తమ తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించి, అమ్ముకొనుటకు మరియు మార్కెంటింగ్ వినియోగాదారు ల అభిరుచి తగట్టుగా వస్తు ఉత్పత్తులను తయరు చేసుకొనుటకు అవకాశాలు మెండుగా ఉన్నయని అలాగే మహిళా పారిశ్రామికవేత్తలను ఒక వేదిక పై చేర్చుట వలన వారు వస్తువుల నాణ్యత, ముడి సరుకు తక్కువ ధరకు ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవడం ఇలా అనేక విషయాలను ఒకరిఒకరు తెలుసుకోడం ద్వారా వారి కి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
ఈ మహిళా ఉత్సవ్ ను ప్రజలు సంద్యంచి ఓత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలను మరియు కాబోయే మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించలని మరియు మహిళా ఉత్సవ్-2025 వేదిక పై మహిళలకు అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అవి. 09.02.2025 న వివిధ జ్యూస్ల ప్రదర్శనల పోటీలు, 10-02-2025 న మెహంది పోటీలు, 11-02-2025 న హెయిర్ స్టైల్ పోటీలు, 12-02-2025 న మహిళ పారిశ్రామికవేత్తలకు సన్మాన 0, 13-02-2025 వ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ శారీస్ ప్రదర్శన పోటీలు, 14-02-2025 న బ్లాక్ ప్రింటి oగ్ శారీస్ ప్రదర్శన పోటీలు, 15-02-2025 న సాంప్రదాయ పిండి వంటల పోటీలు నిర్వహించబడునని తెలిపారు.
శనివారం మధ్యాహం 12-30 గంటలకు మొగల్హాల్, మొగల్ రాజ పురం నందు ప్రారంభోత్సపు సభను నిర్వహిస్తున్నమని, ఈకార్య క్రమానికి ముఖ్య అతిధికి గా యన్. టి.ఆర్ జిల్లా కలెక్టర్, జి. లక్ష్మీశ వారు హాజరు అవుతారని మరియు స్కిల్ డెవలప్ మెండ్ ఆండ్ ఎంట్రప్రెన్యూర్ షిప్ మంత్రిత్వ శాఖ కు చెందిన రీజనల్ డైరెక్టర్. కె. శ్రీనివాసరావు మరి యు జిల్లా స్కిల్ డెవలప్ మెంట్ ఆఫీసర్, యస్. శ్రీనివాసరావు మరియు తదితరులు పాల్గొటారని సంస్థ డైరెక్టరు, పూర్ణిమ తెలియజేశారు.
Prajavartha Online Telugu News