– సమర్థవంతమైన కమిటీని వేయండి
– పరిస్థితులపై నిగ్గుతేల్చండి
– 12 13 తేదీలలో రాష్ట్ర విస్తృత సమావేశాలు
-అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ కట్టడిలో ఉన్న 23 ఎకరాల అగ్రిగోల్డ్ ఆస్తులను కాపాడాలని, సమర్థవంతమైన అధికారితో కమిటీ వేయాలని
అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
గురువారం అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో దాసరి భవన్ వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ 8 రాష్ట్రాలలో అగ్రిగోల్డ్ కంపెనీ పేదలు, మాజీ ఉద్యోగులైన 32 లక్షల మంది నుండి 7వేల కోట్ల డిపాజిట్ వసూలు చేశాక, ఇళ్ల స్థలాల కోసం వేలాది ఎకరాలు హాయ్ ల్యాండ్ నుండి యానం వరకు, దుకాణాలు పరిశ్రమలు పెట్టి, అనంతరం కంపెనీ మూసివేస్తే, ఆందోళన చేయగా, ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని తెలిపారు. అయితే ఇప్పటికీ అన్ని ఆస్తుల మీద యాజమాన్యం పెత్తనం కొనసాగుతుందని, బినామీ ఆస్తులను పలుకుబడి కలిగిన రాజకీయ నాయకులు అమ్ముకొని కొల్లగొడుతుందన్నారని తెలిసిందన్నారు.
కొత్త డీజీపీ, ఐపీఎస్ ఇంత పెద్ద వ్యవస్థలో నెల్లూరులో పది లారీల కలప పోతుందని చెప్పినా ఎమ్ ఆర్ఓ కట్టడి చేయకపోవడంతో, యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం దృష్టి పెట్టాలని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని చర్యలు తీసుకుంటారని నమ్ముతున్నామన్నారు. కొత్త ప్రభుత్వానికి గడువు ఇవ్వాలని ఉద్దేశంతో అగ్రిగోల్డ్ బాధితులతో అక్టోబర్ 28 జరిగిన మహా విజ్ఞాపన దీక్ష చేపట్టగా అధికార ప్రతినిధి వర్ల రామయ్య వచ్చి ఇంకా మీరు ఆందోళనలు చేయకుండా పరిష్కారమేనని హామీ ఇచ్చారని, గత వారంలో జరిగిన పోలీట్ బ్యూరో సమావేశం అనంతరం అచ్చం నాయుడు ప్రెస్ మీట్ లో అగ్రిగోల్డ్ బాధిత ప్రతినిధులకు శుభవార్త అని చెప్పినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. కానీ ప్రభుత్వం చట్టబద్ధంగా కార్యాచరణకు పూనుకోలేదన్నారు. జగన్ మోహన్ రెడ్డి మాటలు భయాందోళన కలిగిస్తుందన్నారు. అందుకనే ఈనెల 12 13 తేదీలలో అమరావతి ప్రాంతంలో రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశాలు ఏర్పాటు చేసి అన్ని జిల్లాలలో ఉన్న ఆస్తుల సమాచారం తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రికి విన్నవిస్తామన్నారు. ఈలోపు నిర్దిష్టమైన అధికారులతో కమిటీ వేసి, నిర్దిష్ట సమయానికి నిర్ధారణ చేయకపోతే ఆందోళన బాట పట్టాల్సి వస్తుందని తెలిపారు.
తొలత ప్రధాన కార్యదర్శి వి తిరుపతిరావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ మూతపడి 11 సంవత్సరాల అయిందన్నారు. 16 వేల ఎకరాలు సిఐడి స్వాధీనపరుచుకుందని, సుమారుగా నెల్లూరులో 3300, ప్రకాశం జిల్లాలో 6600 ఎకరాలు స్వాధీనంలో ఉన్నాయని పేర్కొన్నారు. అయితే నెల్లూరు వరికుంట మండలంలోని 250 ఎకరాలు రూ.10 కోట్లు విలువ చేస్తాయని తెలిపారు. వీటిలో చెట్లను కొట్టేస్తున్నారని తెలిసి ఎమ్మార్వో కు సమాచారం అందించిన పట్టించుకోలేదన్నారు. రూ.30 లక్షలు విలువచేసే చెట్లను కొట్టేసారని తెలిపారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు షరీఫ్, రాంబాబు, మణికంఠ, అప్సర్ లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News