Breaking News

26 వ తేదీ మహా శివరాత్రికి గోష్పాద క్షేత్రంలో అధికారులు కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేయాలి

-పుణ్య స్నానాలు ఆచరించే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలి
-కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరులో ఈ నెల 26 వ తేదీన మహా శివరాత్రి పర్వదినం రోజున భక్తులు పుణ్య స్నానాలు ఆచరించే విధంగా గోష్పాద క్షేత్రం లో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కొ వ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత పేర్కొన్నారు. శనివారం ఉదయం కొవ్వూరు ఆర్టీవో కార్యాలయంలో వివిధ సమన్వయ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం గోష్పాద క్షేత్రాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా ఆర్డీవో రాణి సుస్మిత మాట్లాడుతూ పుణ్య స్నానాలకు వొచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని, లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానంలో కొవ్వూరు పట్టణంలో నది తీర ప్రాంతంలో 10 పడవలు, 10 మంది గజాతగాళ్ళను ఏర్పాటు చేయాలని మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు. మహాశివరాత్రి ఉత్సవాలు ప్రణాళికాబద్ధంగా నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను సన్నద్ధం చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

సోమవారం నుంచి బుధవారం వరకు ఎక్కువ మంది భక్తులు కొవ్వూరు చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈనెల 24వ తేదీ సోమవారం శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సుందరేశ్వరుల కళ్యాణ మహోత్సవం ప్రారంభమవు తుందన్నారు. 25వ తేదీ మంగళవారం నిత్యా ఔపోసన, బలిహారణం, సాంస్కృతిక కార్యక్రమా లు ఉంటాయన్నారు. 26 వ తేదీ బుధవారం మహాశివరాత్రి పర్వదినం రోజున పుణ్య స్నానాలు, రుద్రాభిషేకాలు, అర్ధ రాత్రి లింగో ద్భవ కాలంలో అభిషేకాలు ఉంటాయని తెలిపారు.

గోష్పాద క్షేత్రంలో పారిశుధ్య నిర్వహణ, విద్యుత్ దీపాలు, త్రాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్, టీ నాగేంద్ర కుమార్ ను ఆర్డీవో రాణి సుస్మిత ఆదేశించారు. పార్కింగ్, బందోబస్తు పగడ్బందీగా నిర్వహించాలని పోలీసు అధికారు లు ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం స్నాన ఘట్టం యందు బారి కెట్లు ఏర్పాటు చేయాలని, విద్యుత్ శాఖ ఏ ఈ, జి. మణికంఠ రాజును ఆదేశించారు. గోదావరి ఘాట్లను ఎటు వంటి అగ్ని ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఘాట్లను శుభ్రపరిచే విధంగా చర్య లు తీసుకోవాలని అగ్ని మాపక శాఖ అధికారులను ఆదేశించారు. ఘాట్ల ను శుభ్రపరిచే విధంగా మునిసిపల్ అధికారులతో కలిసి చర్యలు తీసుకోవాలని అగ్ని మాపక శాఖ అధికారులను కోరారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఏటువంటి అవాంఛ నీయ సంఘటనలు జరగకుండా మహా శివరాత్రిఉత్సవాలను విజయవంతం చేయాలని తెలిపారు.

ఈ సందర్భంగా డి.ఎస్.పి, జి. దేవ కుమార్ మాట్లాడుతూ కొవ్వూరులో ఈనెల 25వ తేదీ అర్ధరాత్రి నుండి ట్రాఫిక్ కు అంతరాయం రాకుండా డైవర్షన్ చేయడం జరిగిందని తెలిపా రు. కొవ్వూరు బైపాస్ నుండి ఏ ఎస్ ఆర్ లాడ్జి దగ్గర నుం డి డీఎస్పీ కా ర్యాలయం మీదుగా రైల్వే స్టేషన్ నుండి కాటన్ విగ్రహం వరకు ట్రాఫిక్ ను మళ్ళించడం జరిగిందన్నారు. రాజమండ్రి నుంచి వచ్చే వాహనాలు కూడా కాటన్ విగ్రహం నుండి ఎ ఎస్ ఆర్ లాడ్జి వద్దకు ట్రాఫిక్ ను మళ్ళిం చడం జరిగిందన్నారు. కావున ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి సహకరించవలసిందిగా కోరారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమి షనర్ టి రాజేంద్రకుమార్, ఆర్ &బి డి ఈ, బివి రమణ, ఏ ఈ,ఏజీ ఆ ర్ బి,జి. మణి కంఠ రాజు, డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ, జే.సంధ్య, ఇన్స్పె క్టర్ ఆఫ్ ఫెసరీస్, పి కృష్ణవేణి, ఆల య అర్చకులు యం. శ్రీనివాస మూర్తి తది తరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *