-పరిశ్రమల్లో సాంకేతిక పరమైన అంశాలకు సంబంధించి చిన్న తప్పిదం జరిగిన ఉపేక్షించేది లేదు
-యువత కు వృత్తి నైపుణ్యం కోసం వృత్తి ప్రధాన శిక్షణ అవసరం
-ఎం ఎస్ ఎం ఈ లకు సింగిల్ విండో విధానంలో అనుమతులు జారీ చెయ్యాలి
-ఔత్సాహిక, మహిళా పారిశ్రామిక వేత్తలకు యూనిట్స్ స్థాపన చేయడం బ్యాంకర్ల కు అవగాహన కల్పించడం ముఖ్యం
-పరిశ్రమ- డిఆర్డిఏ- నైపుణ్యాభివృద్ధి సంస్థ సమన్వయం తో అడుగులు వేయాలి
-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని కెమికల్ ఇతర పరిశ్రమలను సేఫ్టీ కమిటీ బృందాలు తరచూ తనిఖీలు నిర్వహించి నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరములో జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహ కమిటీ సమావేశానికి కలెక్టర్ పి. ప్రశాంతి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలోని కెమికల్ ఆధారిత, ఇతర పరిశ్రమలను సేఫ్టీ కమిటీ బృందాలు తరచూ తనిఖీలు నిర్వహించి, భద్రత ప్రమాణాలు, వాటినుంచి వెలువడే రసాయనాలను, వాయువులు స్థాయి ని ఎప్పటికప్పుడు పరిశీలించి నివేదిక అందించాలని ఆదేశించారు. . పరిశ్రమల్లో సాంకేతిక అంశాలకు సంబంధించి ఎక్కడ ఎటువంటి చిన్న తప్పిదం జరిగిన ఉపేక్షించే లేదని కలెక్టర్ హెచ్చరించారు. అస్సాగో, ఏపీ పేపర్ మిల్క్, ఠాగూర్ ల్యాబ్, ధరణి కెమికల్ వంటి పరిశ్రమలతో అన్ని పరిశ్రమలను సాంకేతిక అంశాలపై తనిఖీలు నిర్వహించి నివేదికల సమర్పించాలన్నారు. ఇప్పటికే జిల్లాలో నోడల్ బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శలకు అనుగుణంగా మాత్రమే పరిశ్రమల నిర్మాణం , నిర్వహణ వ్యవస్థ ఉండాలన్నారు. జిల్లాలో పరిశ్రమలకి ప్రోత్సాహం అందించేందుకు సింగిల్ విండో విధానంలో అనుమతులు ఒక్క చోటే ఇస్తున్నట్లు తెలిపారు. అప్లికేషన్స్ పెండింగ్లో లేకుండా కార్యచరణ వేగవంతం , ఇందుకు టైం లైన్ ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లాలో నూతనముగా నిర్మించే పరిశ్రమలకు విద్యుత్తు అందించే ప్రక్రియ వేగవంతం చెయ్యాలని విద్యుత్ శాఖ ఎస్. ఈ ని కలెక్టర్ ఆదేశించారు.
మల్కా కార్టూన్ ఫ్యాబ్రిక్స్ వస్త్రాలు తయారీలో సేంద్రీయ రంగులు అద్దకం, కుట్టు ప్రక్రియలలో నైపుణ్యత గలవారికి శిక్షణను అందించే విధంగా చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖ , నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు చేనేత, జౌళి శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో పరిశ్రమలకు సంబంధించి వాటికి అనుసంధానంగా ఉన్న వాహనాలు జాబితాను, వాహన చోదకుల విధులు, ఆయా వాహనాల యొక్క నిర్వహణకు సంబంధించి పూర్తి సమాచారం అందుబాటులో ఉండాలని జిల్లా రవాణా శాఖ అధికారికి కలెక్టర్ సూచించారు.
గిరిజనుల ఉత్పత్తులను స్థానికంగానే కాకుండా దేశ,అంతర్జాతీయ మార్కెటింగ్ లో విక్రయాలు జరిపేందుకు ఆన్లైన్ సౌకర్యం కలిగించే తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఎం ఎస్ ఎం ఈ ఇంటింటి సర్వేలో భాగంగా జిల్లాలో 92, 980 యూనిట్స్ కి గాను ఇప్పటివరకు 42 949 మాత్రమే చెయ్యడం జరిగిందని, మిగిలిన సర్వే వేగవంతం చేయాలని అధికారులు ఆదేశించార. విశ్వ కర్మ యోజన కింద లబ్ధిదారులఎంపిక సర్వే ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.
సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి వనిధర్, అసిస్టెంట్ డైరెక్టర్ ప్రదీప్, విద్యుత్ శాఖ ఎస్ ఈ కె తిలక్ కుమార్, జిల్లా అగ్నిమాపక అధికారి ఎం మార్టిన్ లూథర్ కింగ్, జిల్లా రవాణా అధికారి ఆర్. సురేష్ , జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి మురళి, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆర్.త్రినాధరావు ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News