Breaking News

బాల నేరస్తులను గుర్తించి వారిలో మార్పు కోసం అడుగులు వేయాలి

-భవిష్యత్ తరాలకు మంచి పౌరులను అందించే దిశగా జువైల్ హోమ్ పని చేయాలి
-జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మంచి పౌరులుగా బాల నేరస్థుల తీర్చి దిద్దే బాధ్యత మనందరి పై ఉన్న తక్షణ కర్తవ్యం, మన బాధ్యత అని జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు.

శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా కార్యాలయం నందు లీగల్ అండ్ డిఫెన్స్ కౌన్సిల్ అడ్వకేట్స్, స్త్రీ శిశు సంక్షేమ, పోలీసు శాఖ ల వారితో స్పెషల్ జ్యూవనలై పోలీసు యూనిట్స్ కి నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ సమాజంలో నేడు ఆదరణ కొరవడిన, వివక్ష గురి అవుతున్న చిన్నారులు నేర ప్రవృత్తి బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి ప్రతి చిన్నారిని గుర్తించి, వారిని సరైన మార్గంలో నడిపించాలని, ఆ దిశగా చర్యలు చేపట్టి తీర్చి దిద్దిన నాడే ఆరోగ్యవంతమనవ సమాజం ఏర్పడుతుందని ఆమె అన్నారు. చిన్నారులు ఎక్కడా కూడా నేరాలకు పాల్పడకుండా వారిని చైతన్య పరచాలని , ఆ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని పేర్కొన్నారు. ఎవరైనా చిన్నారులు నేరాలకు పాల్పడితే వారిని అబ్జర్వేషన్ హోమ్ లో పెట్టి మళ్ళీ నేరాలకు పాల్పడకుండా వారిని తీర్చిదిద్దే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. చిన్నారులపై వచ్చే కేసులో విషయమై పోలీసు వారు తయారు చేసే డాక్యుమెంటరీ సాక్షుల విచారణ వంటి పలు అంశాలపై తగు శిక్షణ తీసుకోవలసినదిగా కోరారు. తల్లిదండ్రులు పనికి వెళ్లిన సమయంలో ఇంటి వద్ద ఉన్న చిన్నారులు చిన్న చిన్న నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నప్పుడు అట్టివారిని గుర్తించి వెంటనే వారి ప్రవర్తన మారే విధంగా కౌన్సిలింగ్ ఇప్పించవలసి ఉంటుందన్నారు. అట్టి చిన్నారులు పెరిగి పెద్దవారై సమాజానికి హాని చేసే అవకాశం ఉన్నందున వారిని చిన్నతనంలోనే కట్టడి చేయవలసినదిగా ఆమె అన్నారు. ఎవరైనా చిన్నారులు వికలాంగులు ఉంటే అట్టివారిని గుర్తించి వారికి తగు సహాయ సహకారాలు ప్రభుత్వం అందాల చర్యలు తీసుకోవలసినదిగా ఆమె అన్నారు. నేరం చేసిన వారిని జ్యూవెన లై చిన్నారులు గా గుర్తించే సమయంలో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తప్పనిసరిగా ఉండాలని ఆమె అన్నారు. నేరం చేసిన వారిని అరెస్టు చేసే విషయంలో తప్పనిసరిగా తగిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండే విధంగా చూసుకోవాలని ఆమె అన్నారు.

రాజమహేంద్రవరం అడిషనల్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ ఎన్ బి ఎం మురళి మాట్లాడుతూ జ్యూ వెనెలై చిన్నారులను అరెస్టు చేసిన సమయంలో వారి పట్ల కేరింగ్ మరియు రక్షణ విషయంలో మరింత జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు. బాలికల పాఠశాలలు మరియు సాంఘిక సంక్షేమ హాస్టల్స్ నందు, కళాశాల నందు చిన్నారులపై జరిగే దాడులను నివారణ నిమిత్తం అట్టి ప్రదేశాలలో కెమెరాలు ఏర్పాటు చేసి డాక్యుమెంటరీస్ ఎవిడెన్స్ వచ్చేలా ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. కెమెరాలు ఏర్పాటు చేయడం వలన నేరాలుకు పాల్పడే వారు వెనకడుగు వేస్తారని, ఒకవేళ నేరం జరిగితే డాక్యుమెంటరీ దొరుకుతుందని తద్వారా నేరస్తులను శిక్షించడం న్యాయస్థానానికి సులభతరం అవుతుందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ మూడవ ఏ.జె.ఎఫ్. సీఎం, రాజమహేంద్రవరం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ శ్రీమతి ఎన్. శ్రీలక్ష్మి, కోనసీమ అడిషనల్ ఎస్పీ ఏవిఆర్ పిబి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

​రాజమండ్రిలో ముగిసిన పోషణ్ మాహ్ ప్రదర్శన : ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు హాజరు

​రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *