-రెవెన్యూ సేవలు అందించడంలో నిర్దేశించిన లక్ష్యలను పూర్తి చెయ్యాలి
-కలెక్టర్ పి. ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రెవిన్యూ సేవలు అందించే క్రమంలో జవాబుదారీతనం కలిగి ఉండేలా చూసుకోవాలని, రీ సర్వే లో భాగంగా మ్యుటేషన్, కొరిలేషన్, గ్రౌండ్ టూతింగ్ పనులను పూర్తి చేసే విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. శనివారం స్ధానిక కలక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా రెవిన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, డి ఆర్వో టి సీతారామ మూర్తి, కలక్టరేట్ ఏవో ఎమ్ డి. ఆలీ లతో కలిసి మండలాల వారీగా రెవిన్యూ అధికారుల పని తీరును సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం లో భాగంగా ఎక్కువ మొత్తంలో రెవిన్యూ పరమైన అంశాలపై అర్జీలను స్వీకరించడం జరుగుతుందని, వాటికి పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపట్టాల్సింద ఉందన్నారు. వీటిలో ఎక్కువగా ఐదు కేటగురిలకి చెందిన అర్జీలు ఉన్నాయని వాటిలో మ్యుటేషన్లపై రెవెన్యూ ఫిర్యాదులు, రెవెన్యూ రికార్డులలో నమోదుల ఆదాయ సవరణ, ఎస్ ఎల్ ఏ సర్టిఫికేట్లు (రెవెన్యూ) ఆర్ వో ఆర్ డేటాలో దిద్దుబాట్ల కోసం ప్రజలు రావడం జరుగుతుందని తెలిపారు. అర్జీ దారుని సమస్య వినడం వల్ల సమస్యకు పరిష్కారం లభిస్తుందని అన్న నమ్మకం కలుగుతుందన్న విషయాన్ని గుర్తు చేశారు.
ప్రజా సమస్యల పరిష్కారం తో ఉద్యోగ సంబంధ రెవెన్యూ అభ్యర్థన, రెవెన్యూ ఉద్యోగుల సేవా సమస్యలు ఇంక్రిమెంట్ల మంజూరు/ ప్రమోషన్ కోసం అభ్యర్థన/మెడికల్ రీయింబర్స్‌మెంట్ మంజూరు కోసం పెండింగ్ ఫైల్స్ పురోగతిపై అంశాలపై సమీక్షించారు. అర్జీలు పరిష్కరం కొరకు తిరిగి తెరవడం జరిగిందని వాటిలో రెవెన్యూ రికార్డులలో రెవెన్యూ సవరణల నమోదులు, ఉద్యోగులపై ఫిర్యాదుదారులు ఎక్కువగా ఉంటున్నట్లు తెలిపారు.
ప్రజలకు జారీ చేయవలసిన సర్టిఫికెట్ల జారీ జాప్యం, ప్రభుత్వం సేకరించిన భూమికి పరిహారం చెల్లించకపోవడం, భూసేకరణపై తీసుకొన్న చర్యలపై సమీక్షించారు.
రెవిన్యూ డివిజన్ అధికారి ప్రతి రోజు కనీసం ఒకసారైనా తహసిల్దార్ వారీగా అర్జీల పరిష్కారం కోసం చేపడుతున్న చర్యలు పై సమీక్ష నిర్వహించాలన్నారు. సీఎంవో , మంత్రులు, రాష్ట్ర స్థాయి లో వస్తున్న అర్జీలను త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార విధానం లో రెవెన్యు అధికారులు పాత్ర కీలకం అన్నారు. సోమవారం నాటికి భూసేకరణకు సంబంధించి పెండింగ్ అంశాల పైన ఫారం సి ద్వారా ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. అబ్జెక్షన్ లేని ప్రభుత్వం భూముల్లో పేదలు నివాసం వున్నట్లయితే కరెంటు బిల్, వాటర్ టాక్స్ ఆధారంగా వెరిఫికేషన్ చెయ్యాలన్నారు. ఎయిర్పోర్ట్, డిఫెన్స్ ల్యాండ్స్ , జాతీయ రహదారులు వంటి ప్రాధాన్యతతో కూడిన భూ సేకరణ పనులు వేగవంతం చేసి సోమవారం నాటికి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు.
దీపం పథకం ద్వారా లబ్దిదారులకు ఇచ్చే సబ్సిడీ వారి బ్యాంకు అకౌంట్ వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే వివిధ శాఖల పనితీరుపై క్యూ ఆర్ కోడ్ ద్వారా సమగ్ర సర్వే నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలియ జేశారు. మీ పనితీరుకు ప్రజలే నిర్ణయిస్తారని కలెక్టర్ తెలిపారు. వచ్చే సమీక్ష నాటికీ పెండింగ్ లోఉన్న అన్ని రెవెన్యూ అంశాలు పూర్తి చెయ్యాలన్నారు.
జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ, సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకం కల్పించడం లో క్షేత్ర స్థాయిలో తహసీల్దార్లు వ్యవహరించే తీరు ముఖ్యం అన్నారు. ఆర్డీవో అధ్వర్యంలో మండల వారీగా ఫిర్యాదులు పరిష్కార విధానం పై ప్రత్యక్ష పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశం లో జిల్లా రెవిన్యూ అధికారి టి సీతారామ మూర్తి, ఆర్డీవో లు ఆర్ కృష్ణ నాయక్ , రాణి సుస్మిత, ఏవో ఆలీ, తహశీల్దార్లు, కలక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News