Breaking News

త్వరలో 10 కోట్లు రూపాయ‌ల‌తో భ‌వానీపురం స్టేడియం… : మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దాదాపు 10కోట్లు రూపాయ‌ల వ్యయంతో 10ఎక‌రాల స్థ‌లంలో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హ‌యంలో విజ‌య‌వాడ‌కు ఐకాన్‌గా అధునిక హంగుల‌తో భ‌వానీపురం స్టేడియం నిర్మాణం పూర్తి చేస్తామ‌ని దేవ‌దాయ ధ‌ర్మ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు. శుక్ర‌వారం న‌గ‌ర పాల‌క సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు జ‌రిగిన స‌మావేశంలో మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు, న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, కార్పొరేట‌ర్లు అబ్దుల్ అకిమ్ అర్ష‌ద్‌, గుడివాడ ర‌ఘ‌వా న‌రేంద్ర‌, మైల‌వ‌ర‌పు ర‌త్న‌కుమారి, బుల్లా విజ‌య్ కుమార్‌, మ‌రుపిళ్లా రాజేష్‌, శీరం పూర్ణ‌చంద్ర‌రావు, గొదావ‌రి గంగా త‌దిత‌రుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. విద్యాధ‌ర‌పురం స్టేడియం పై అధికారులు ప‌వ‌ర్ పాయింట్ ద్వారా రూపొందించిన‌ డిజైన్లు మంత్రి వెలంప‌ల్లికి వివ‌రించారు. అధికారులు రూపొందించి డిజైన్లు ప‌రిశీలించిన మంత్రి ప‌లు సూచ‌న‌లు చేశారు. ఇన్‌డోర్ స్టేడియంతో పాటుగా బ్యాడ్మింట‌న్‌, వాలీబాల్‌, బాస్కెట్ బాల్‌, హ్యండ్ బాల్ క్రికెట్‌, ష‌టిల్ కోర్టు, వాల్ టు వాల్ వాకింగ్ ట్రాక్ నిర్మాణం, యోగా, ఓపేన్ జిమ్‌, పుడ్ కోర్టు, వంటి ప‌లు ర‌కాల ఆట‌లు విడివిడిగా అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాల‌న్నారు. ఆధునిక హంగుల‌తో స్టేడియం నిర్మాణం మ‌రియు పార్కింగ్ సౌక‌ర్యం క‌ల్పించాలని సూచించారు. అదేవిధంగా స్కేటింగ్‌, స్మిమింగ్ పూల్‌, సైకిలింగ్ ట్రాక్ ఏర్పాటుకు గల అవకాశాలను ప‌రిశీలించాల‌న్నారు. మంచి ఆహ్ల‌ద‌క‌ర‌మైన వాత‌వ‌ర‌ణంలో స్టేడియం నిర్మాణం పూర్తి చేసి క్రీడాకారుల‌కు అందుబాటులోకి తీసుకురావాల‌న్నారు. స‌మావేశంలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, ఎస్.ఇ.బి.నరశింహమూర్తి మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *