-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అన్నా క్యాంటీన్ల పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండ రాదని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా అజిత్ సింగ్ నగర్ అన్న క్యాంటీన్ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్న క్యాంటీన్లో వచ్చిన ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలని అందుకు పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరగాలని, భోజనం అనంతరం పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని అధికారుల ఆదేశించారు. నోడల్ ఆఫీసర్లు అందరూ తమ తమ అన్న క్యాంటీన్లో ఎటువంటి మరమ్మతులు ఉన్న వెంటనే పరిష్కరించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని కమిషనర్ అన్నారు. ఈ పర్యటనలో చీఫ్ ఇన్జినియర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ జి వి జి ఎస్ వి ప్రసాద్, ఇంచార్జ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరిండెంటింగ్ ఇంజనీర్లు పి సత్యకుమారి, పి సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు