రాజమహేంద్రవరం / కొవ్వూరు / అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం తూర్పు గోదావరి జిల్లాలో ఆహార కమిషన్ సభ్యులు జక్కంపూడి కిరణ్ పర్యటించారు. కొవ్వురు లో పలు స్కూల్ లు రేషన్ షాపు లు, సందర్శించారు..అనపర్తి గాంధినగర్ , సునందపేట , ఇందిరా నగర్ , షారోనుపురం టీటీడీ కళ్యణ్ మండపంలో అంగన్వాడీ సెంటర్ సందర్శించారు. స్టాక్ రికార్డు లు సరిగ్గా నిర్వహించక పోవడం పై సీడీపీఓ మరియు సూపర్ వైజర్ లకు మెమో ఇవ్వమని ఐసీడీఎస్ పీడీ కే. విజయ కుమారి నీ ఆదేశించారు. లక్ష్మి నర్సాపురంలో డా బి ర్ అంబేద్కర్ గురుకులం హాస్టల్ ను , అనపర్తి లోని జెడ్పీ హై స్కూల్ ను సందర్శించి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మెనూ ప్రకారం ఆహారంపెట్టాలనీ ఆదేశించారు. విద్యార్థులు తో కలిసి భోజనం చేసి ఆహార లోటుపాట్లను అడిగి తెలుసుకున్నారు. అనపర్తి ఏరియా హాస్పిటల్ లో PMMVY పథకం గురించి అక్కడ రోగులకు, వారి సహాయకులకు అవగాహనా కల్పించారు. హాస్పిటల్లో ఇచ్చే ఆహారంను తనిఖీ చేసి లోపాలను సరిచేయమని ఆసుపత్రి సూపరింటెండెంట్ కు సూచనలు చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె. విజయ కుమారి, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ టి. రాధిక , గిరిజన సంక్షేమ జిల్లా అధికారి కే ఎన్ జ్యోతి , సాంఘిక సంక్షేమ అధికారులు, బిసి వసతి గృహాల అధికారులు , తూనికలు కొలతలు, జిల్లా ఆహార భధ్రత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
