తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సంచాలకులు, సాంఘిక సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్, అమరావతి వారు తమ ఉత్తరువులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము సాంఘిక సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖల ద్వారా ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఉచిత వసతి మరియు ఉచిత భోజనాది సదుపాయాలతో డీఎస్సీ శిక్షణను కొరకు ప్రైవేటు శిక్షణా సంస్థలను గుర్తించి వాటి ద్వారా శిక్షణ ఇప్పించుటకు అన్ని ఏర్పాట్లు చేయడమైనది. దానికి సంబంధించి అభ్యర్థుల నమోదు కార్యక్రమం కూడా పూర్తి చేయడం జరిగినది. ఇందులో భాగంగా ఇప్పటికే 1000 మంది షార్ట్స్ట్ చేయబడిన అభ్యర్థులు తమ వెబ్ ఆప్షన్లను పూర్తి చేశారు. షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులు ఎంపానెల్డ్ కోచింగ్ సంస్థలకు వెబ్ ఆప్షన్ సర్వీస్ ద్వారా వారి ప్రాధాన్యతలను ఎన్నుకోవాలి. షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులు వారి ప్రాధాన్యత ప్రకారం అన్ని కోచింగ్ సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వాలి. షార్ట్స్ట్ చేయబడిన అభ్యర్థులందరూ తమ వెబ్ ఆప్షన్లను “జ్ఞానభూమి” పోర్టల్ మరియు https://mdfc.apcfss.in వెబ్ పోర్టల్లో పూర్తి చేయడానికి ఆఖరి తేది 15.03.2025 అని తెలియజేసినారు.
Tags tirupathi
Check Also
స్వర్ణాంధ్ర , స్వచ్ఛ ధర్మవరం లక్ష్యంగా ముందుకు సాగుదాం.
-ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధ్యం… -మంత్రి సత్య కుమార్ యాదవ్ ధర్మవరం, నేటి పత్రిక ప్రజావార్త : పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన …