Breaking News

పీఎం సూర్యఘర్ పథకంలో బీసీలకు అదనపు రాయితీపై సీఎం చంద్రబాబు ప్రకటన

-సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకునే బీసీలకు రూ.20 వేల అదనపు సబ్సీడీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకునే బీసీలకు కేంద్రం ఇచ్చే రాయితీకి అదనంగా రూ.20 వేలు సబ్సిడీ రూపంలో అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో ప్రకటించారు. 2 కిలో వాట్ల సోలార్ రూఫ్‌టాప్‌ ఏర్పాటుకు రూ.1.20 లక్షలు వరకు ఖర్చవుతుండగా కేంద్ర ప్రభుత్వం రూ.60 వేలు రాయితీగా అందిస్తుంది. అయితే బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మరో రూ.20 వేలు అదనంగా రాయితీ అందించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. దీని ప్రకారం 2 కిలో వాట్ల రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకునే బీసీలకు రాష్ట్రం కూడా ఇచ్చే రాయితీతో కలిపి రూ.80 వేల వరకు సబ్సిడీ అందుతుంది. బీసీ వర్గాలకు అండగా ఉండాలనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నేడే (మార్చి 15 ) జి ఎస్ ఎల్ లో వెదురు సాగుపై శిక్షణా కార్యక్రమము 

– హాజరుకానున్న 15 మంది ఉద్యానవన అధికారులు, 100 మంది అభ్యుదయ రైతులు – ఆసక్తీ కలిగిన రైతులు ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *