-” స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ సాధనలో మార్చి నెల థీమ్ ” కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం మార్చి 15 వ తేది స్వచ్ఛ ఆంధ్ర సూచికల కింద పరిశుభ్రత మరియు పరిశుభ్రతను ప్రోత్సహించడానికి “స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర- ” “S.A.S.A” కార్యక్రమం కోసం కార్యాచరణ మార్గదర్శకాలను ఆయా శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలను తప్పని సరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. 2025 సంవత్సరం లో ప్రతి నెలా ఒక థీమ్ తో స్వచ్ఛంద్ర కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లడం జరుగుతోందనీ అన్నారు. మార్చి నెలలో ” ఒకసారి వాడిన ప్లాస్టిక్‌ను నివారించండి.. పునర్వినియోగాన్ని ప్రోత్సహించండి ” అనే నినాదం తో ప్రజల్లోకి తీసుకుని వెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు. నగరపాలక సంస్థ అధ్వర్యంలో, జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో శానిటేషన్ డ్రైవ్, సింగిల్ ప్లాష్టిక్ వినియోగం అరికట్టడం పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మూడో శనివారము నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమాలను చేపట్టి తదుపరి జిల్లా పరిషత్ సమావేశానికి హజరు కావాలని అధికారులకి, నియోజక వర్గ, మండల స్థాయి ప్రత్యేక అధికారులకు కలెక్టర్ తెలియ చేశారు. అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.
శాఖల వారీగా బాధ్యతలు…
పట్టణ ప్రాంతాలు లో మునిసిపల్ కార్పొరేషన్ , పురపాలక సంఘాలు, గ్రామీణ ప్రాంతాలు – పంచాయతి రాజ్ – గ్రామీణాభివృద్ధి సంస్థ , పరిశ్రమలు & వాణిజ్యం, కాలుష్య నియంత్రణ జిల్లా పరిశ్రమల, కంపనీ ఇన్స్పెక్షన్
విద్యా సంస్థలు .. ఇంటర్మీడియట్, పాఠశాల విద్య, సంక్షేమ హాస్టళ్లు .. సంక్షేమ శాఖ అధికారులు , అంగన్‌వాడీలు .. జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి,ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు – జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, మార్కెట్లు – మున్సిపల్,. మార్కెటింగ్ , రైతు బజార్లు, ఫిషింగ్ మార్కెట్లు .. మార్కెటింగ్, మత్స్య శాఖ అధికారులు , రోడ్లు- రవాణా – జిల్లా రవాణా అధికారి , రోడ్లు – జాతీయ రహదారులు సంస్ధ, వస్త్ర పరిశ్రమ, పర్యాటక శాఖ , మతపరమైన సంస్థలు యందు ఆయా శాఖల, సంస్థల ప్రతినిధులు ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమం చేపట్టాలని పేర్కొన్నారు. అందువల్ల చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ స్వర్ణ ఆంధ్ర – స్వాచ్ ఆంధ్ర కార్యకలాపాలకు జిల్లా నోడల్ అధికారి మరియు జిల్లాలో నిర్వహించే కార్యకలాపాల రియల్ టైమ్ డేటా సమర్పణను పర్యవేక్షించడం నిర్ధారిస్తారు
Prajavartha Online Telugu News