రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గనులు భూగర్భశాఖ రాజమహేంద్రవరం, జల వనరుల శాఖ, ఏజీఎల్బి సెక్షన్, స్థానిక రెవెన్యూ మరియు జిల్లా స్థాయి ఇసుక టాస్క్ ఫోర్స్ అధికారులు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో గల డిసిల్టేషన్ రీచు కోటిలింగాల ఇసుక ర్యాంపు 11.900 కిమీ “అఖండ గోదావరి లెఫ్ట్ బ్యాంకు” (AGLB) వద్ద ఇసుక కార్యకలాపాలు జరుగుచున్న ప్రదేశం సంయుక్తంగా తనిఖీ చేసి నూతన ఇసుక విధానం 2024 ప్రకారం జలవనరుల శాఖ వారు అనుమతించిన బోట్స్ మెన్ సొసైటీలు కాకుండా , ఇతర బోట్స్ మెన్ సొసైటీలు అనాధికారకంగా ఇసుక నిల్వలు ఏర్పరిచినట్లు అధికారులు గుర్తించడ మైనదని జిల్లా మైన్స్ మరియు జుయాలజి సహాయ సంచాలకులు డీ. ఫణి భూషణ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియ చేశారు. తనిఖీ సమయంలో కోటిలింగాల ఇసుక ర్యాంపుకు దక్షిణ దిశలో గోదావరికి అనుకుని నిల్వ చేయబడిన రెండు ఇసుక గుట్టలు గుర్తించి ఇసుక పరిమాణం లెక్కించగ 905 మెట్రిక్ టన్నులుగా ఉంది. ర్యాంపుకి ఉత్తర దిశలో నిల్వ చేయబడిన మూడు ఇసుక గుట్టలు గుర్తించి ఇసుక పరిమాణం లెక్కించగా 210 మెట్రిక్ టన్నులుగా ఉంది. మొత్తం వెరసి 1,115 మెట్రిక్ టన్నులు ఇసుక గుర్తించడమైనది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఇసుక నిల్వ గల భూమి సర్వేనెం. 7/2 రాజమహేంద్ర వరం అర్బన్ అని తెలియవచ్చినది. జల వనరుల శాఖ అనుమతులు లేకుండా బోట్ల ద్వారా ఇసుకను తెచ్చి స్టాక్ చేయుట చట్ట విరుద్ధమైన చర్య, కావున సదరు ఇసుక నిల్వలను అధికారులు స్వాధీన పరచుకుని తదుపరి చర్యల నిమిత్తం సంరక్షణ కొరకు గ్రామ రెవెన్యు అధికారి వార్కి అప్పగించడమైనది. నూతన ఇసుక విధానం, 2024 ప్రకారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ, తూర్పుగోదావరి జిల్లా వారు నిబంధనలు మీరి ఇసుక కార్యకలాపాలు చేసిన యెడల వారి పై చర్యలు తీసుకొనబడునని హెచ్చరించడమైనది.
Prajavartha Online Telugu News