Breaking News

నగరపాలక సంస్థ అధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్

– సింగిల్ యుజ ప్లాస్టిక్ పై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు
– కమీషనర్ కేతన గార్గ్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి ప్రతి నెల మూడో శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమాన్ని మార్చి 15 న చేపట్టనున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్ కేతన గార్గ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. మార్చి 15 వ తేది ఉదయం 9.30 గంటలకి కంబాల చెరువు నుంచి పుష్కరఘాట్ వరకు ర్యాలీ స్వచ్ఛంధ్ర ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం 10 గంటలకి పుష్కర్ ఘాట్ వద్ద స్వచ్ఛంధ్ర ప్రతిజ్ఞ చెయడం జరుగుతుందని, తదుపరి స్వచ్ఛంధ్ర స్ఫూర్తి తో సంతకం ప్రచారం, పోస్టర్ ఆవిష్కరణ , స్టాల్ల్స్ సందర్శన ఏర్పాటు చెయ్యనున్నట్లు తెలిపారు. మార్చి నెలలో చేపడుతున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర థీమ్ ను సింగిల్ యుజ్ ప్లాస్టిక్ పై చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ఉదయం ప్రత్యేక బృందాలతో కూడి వాణిజ్య సంస్థలు మరియు వీధి వ్యాపారులకు పోస్టర్ పంపిణీ మరియు అవగాహన ప్రచారాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, స్ధానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది,స్వచ్ఛంధ సంస్థలు పాల్గొనడం జరుగుతుందన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *