Breaking News

రూ.50 వేలు ఆర్ధిక సహాయం మొత్తాన్ని ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
దేవరపల్లి మండలం దేవరపల్లి గ్రామానికీ చెందిన తంగెళ్ళ సాంబశివరావు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెనుకబడిన తరగతుల కేటగిరి కింద గృహ నిర్మాణం చేపట్టడం కోసం రూ.50 వేలు ఆర్ధిక సహాయం మొత్తాన్ని ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గతంలో అందచేసిన రూ.1,80,000 లకి అదనంగా మరో యాభై వేలు ఆర్ధిక సహాయం విడుదల చెయడం పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర ప్రజా ప్రతినిధులకు, అధికారులకి మనః స్ఫూర్తిగా కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. దేవరపల్లి మండలం లో 3064 మంది గృహ లబ్దిదారులు ఉండగా వారిలో ఎస్సీలు 1981 ,  ఎస్టీ లు 78  ,  బిసి లు 1005 మంది ఉన్నట్లు తెలిపారు. శనివారం నుంచి ఇంటింటికి తిరిగి లబ్దిదారులలో అవగాహాన కల్పించడం జరుగుతుందని హౌసింగ్ పిడి ఎస్ భాస్కర్ రెడ్డి తెలిపారు. ఇంటి నిర్మాణం కోసం ముందుకు వొచ్చే లబ్దిదారులకు నాలుగు దశల్లో 15 వేలు, 15 వేలు, 10 వేలు, 10 వేలు చొప్పున నిధులను నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు ఇంటి నిర్మాణం పురోగతినీ అనుసరించి జమ చేయనున్నట్లు తెలిపారు. మే నెలాఖరు నాటికి ఇంటి నిర్మాణం నూరుశాతం పూర్తి చెయ్యాల్సి ఉంటుందన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *