– కొత్త సూపరింటెండెంట్ డాక్టర్ మెట్లపల్లి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ప్రభుత్వాసుపత్రి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయగలనని నూతనంగా బాధ్యతలు చేపట్టిన గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం అధిపతి డాక్టర్ మెట్లపల్లి జగన్ మోహన్ రావు అన్నారు. ప్రస్తుత అవసరాలకు తగ్గట్లుగా అన్ని విభాగాలను బలోపేతం చేసి అన్ని వర్గాలు, అన్ని వయసుల వారికి ప్రభుత్వాసుపత్రిలో అందుబాటులో ఉండేలా, అలాగే తమ వంతుగా విశేష వైద్య సేవలు లభించేలా వైద్యులు, సిబ్బంది సహకారంతో తన వంతు కృషి చేయగలను అన్నారు. డాక్టర్ జగన్మోహన్ రావు గతంలో రెండు పర్యాయాలు 2012, 2016-17 సంవత్సరాల్లో సూపరింటెండెంట్ గా సమర్థవంతంగా తన సేవలు అందించిన ఘనత ఉంది.
Tags vijayawada
Check Also
పరిసరాల పరిశుభ్రత మనఅందరి బాధ్యత..పరిశుభ్రతతోనే ఆరోగ్యం…
-పత్రి ఒక్కరిలో స్వచ్ఛత పై అవగాహన కలిగించాలి.. -స్వచ్ఛత-శుభ్రత పై ప్రజలు నైతిక బాధ్యత వహించాలి.. -మురుగు కాలువగట్లపై చెత్తను …