Breaking News

వసతి గృహాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు, మౌలిక వసతులు మరమ్మత్తులు పూర్తి చెయ్యాలి

-రానున్న విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఆయా పనులు పూర్తి కావాలి
-ప్రతి వసతి గృహనికి ఒక ప్రత్యేక అధికారినీ నియమించి పర్యవేక్షణా బాధ్యత అప్పగించాలి
-కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్షేమ వసతి గృహాల నిర్వహణ విషయంలో హేతుబద్ధీకరణ కలిగి ఉండాలని, మౌలిక వసతులు కల్పించే విధానంలో కార్పొరేట్ సామాజిక బాధ్యతగా చేపట్టిన పనులను నిర్ణిత సమయంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. శనివారం స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంక్షేమ శాఖల అధికారులతో కలెక్టరు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, త్వరలో ప్రారంభం కానున్న విద్యా సంవత్సరం నాటికి సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలను హేతుబద్ధీకరణ విధానంలో అభివృద్ది చేయాలని కోరారు. సామాజిక బాధ్యత వహించే విధానంలో భద్రత కోసం సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు . ఉపాథి హామీ పథకం కింద కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టడం కోసం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రానున్న విద్యా సంవత్సరం నాటికి ఆయా పనులు పూర్తి చేయాలని తెలియ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించే పథకాలు లబ్దిదారులకు అందించే క్రమంలో బిసి కార్పొరేషన్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ స్ధానికంగా అందుబాటులో లేకపోవడం వల్ల ఆయా కార్యక్రమాల అమలు చేయడం పై తూర్పు గోదావరి జిల్లా పరిధిలో సాంఘిక సంక్షేమ అధికారి వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు త్వరితగతిన పరిష్కరించాలని, అందుకోసం నెలవారి ప్రగతి నివేదిక అందచేయాలని పేర్కొన్నారు. బిసి ఎస్సీ ఎస్టీ ల విద్యార్థులు , నిరుద్యోగ యువత కోసం డీఎస్సీ కోచింగ్ పై కళాశాల స్థాయి లో అవగాహన కల్పించాలని కోరారు.  భూపతి రాజుపాలెం  సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఖాళీ స్థలంలో ఎస్సీ లబ్ధిదారులకు చెట్లు పెంపకానికి, తద్వారా ఆదాయం సమకూర్చే క్రమములో సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బడిబయట  పిల్లలను గుర్తించి రాబోయే విద్యా సంవత్సరంలో తరగతులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.  ఇందు కోసం జిల్లా విద్యా శాఖ, మహిళా శిశు సంక్షేమ అధికారి తో సమన్వయం చేసుకోవాలన్నారు. నియోజక వర్గాల పరిథిలో డా బి ఆర్ అంబేద్కర్ భవాన్ నిర్మాణం కోసం చర్యలు తీసుకోవాలని, ఇందు కోసం జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో తగిన భూములను గుర్తించాలన్నారు.  వచ్చే విద్యా సంవత్సరానికి హాస్టల్స్ , వసతి గృహాలలో విద్యార్థుల సంఖ్య హేతుబద్ధత కలిగి ఉండేలా తక్కువ విద్యార్థులు ఉన్న వసతి గృహాలతో అనుసంధానం చేపట్టే కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. సామాజిక బాధ్యత కింద కంపెనీలు, వ్యక్తుల నుంచి సేకరించే నిధులతో సి సి కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఉపాథి హామీ పథకం కింద కాంపౌండ్ వాల్ నిర్మాణం పూర్తి చేయాలన్నారు. అదే విధంగా మరమ్మత్తులు చేపట్టి పూర్తి చెయ్యాలని పేర్కొన్నారు. సంక్షేమ వసతి గృహాల నిర్వహణ కోసం ఒకొక్క వసతి గృహానికి ఒక ప్రత్యేక అధికారినీ నియమించుకుని పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎమ్ ఎస్ శోభారాణి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె ఎన్ జ్యోతి, జిల్లా బిసి సంక్షేమ అధికారి బి శశాంక లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *