గత రెండేళ్లలో రూ. 306 కోట్ల విలువైన 1.35 లక్షల సర్జరీలు… 

-కోవిడ్ వేళ ఆదుకున్న డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్ ను ఆరోగ్యశ్రీ కింద చేర్చి ఉచిత వైద్యం అందిస్తోంది. కోవిడ్ సోకిన పేదలు, మధ్యతరగతి ప్రజలు చికిత్సకు అప్పులపాలుకాకుండా ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందించబడుతుంది. ఇందులో భాగంగా కృష్ణా జిల్లాలో 9,312 మందికి రూ. 21.34 కోట్ల విలువైన ఉచిత వైద్యం కోవిడ్ రోగులకు అందింది. పేద రోగులకు భరోసానిస్తూ 2,400 జబ్బులను ఆరోగ్యశ్రీలో చేర్చడంతో పాటు దేశంలోనే మొదటి సారిగా కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చిన ఘనత రాష్ట్రానికి చెందుతుంది. అంతేకాకుండా బ్లాక్ ఫంగస్ చికిత్సకు పేదవాడు భరించలేని లక్షల రూపాయల ఖర్చును కూడా ఇందులో చేర్చింది. ఆరోగ్యశ్రీలో చేర్చబడింది. ఈ
డా.వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం జిల్లాలోని పేదలకు ఆరోగ్యానికి భరోసాను ఇచ్చింది. ఉచితంగా పెద్ద, చిన్న అపరేషన్లే కాకుండా చికిత్స తరువాత కోలుకునే సమయంలో కూడా ఆర్థిక భరోసాను అందిస్తోంది. వైఎస్ఆర్ భరోసా కింద రోజుకు రూ. 225 చొప్పున నెలకు రూ. 5వేలు ఆర్ధిక సహాయం అందించి ప్రభుత్వం ఆర్థికంగా తోడ్పాటు అందిస్తోంది. అపరేషన్ అయిన తరువాత పనులకు పోలేక పస్తులు పడే పరిస్థితులు ఇంకా రాకూడదనే ఈ సహాయం అందిస్తున్నారు.
కృష్ణాజిల్లాలో 2019 జూన్ నుంచి 2021 ఆగస్టు 2 వరకు 15 వరకు డా. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద అందించిన వైద్య సేవల గణాంకాలను పరిశీలిస్తే గత రెండేళల్లో రూ. 306,68,03,059 (రూ. 306.68 కోట్లు ) విలువైన 1,35,936 వివిధ సర్జరీలు,థెరపిలు నిర్వహించారు. డా. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద జిల్లాలో 122 వివిధ ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందించబడుతున్నాయని ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్ ఉస్మాన్ తెలిపారు. వీటిలో రెండు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులు, మూడు ఏరియా ఆసుపత్రులు, 10 సిహెచ్ సిలు, 23 పిహెచ్ సిలతోపాటు, 49 ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయన్నారు. ఇవి కాకుండా కోవిడ్ వైద్య సేవల కోసం 35 ప్రైవేటు ఆసుపత్రుల కోసం అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లాలో సుమారు 12 లక్షల పైన కుటుంబాలకు ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు అందించమన్నారు. విజయవాడ భవానిపురం ఆర్టీసీ వర్క్ షాపు రోడ్డులో నివాసం వుంటున్న షేక్ రెష్మా తాము రోజు వారి కార్మిక కుటుంబానికి చెందిన వారంమన్నారు. స్మైల్ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ లో ప్రసవం కోసం ఆపరేషన్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద చేయించుకునన్నాని తెలిపారు. రూ. 17 వేలు అయ్యే అపరేషన్‌ను ఉచితంగా చేయించుకోగలిగానని తమకు ఆరోగ్య మిత్ర ఈ విషయంలో ఎంతో సహకరించారన్నారు. ఆసుపత్రిలో ఉచితంగా భోజనం కూడా అందించారన్నారు. విజయవాడ పైపుల రోడ్డు చెందిన షేక్ మస్తాన్ (50సం) మాట్లాడుతూ తాను నడుమ నొప్పితో ఎన్నో ఆస్పతులను తిరిగానన్నారు. ఇది చాలా ఖర్చుతో కూడిన వైద్య మని మరికొందరు చెప్పరన్నారు. అయితే ఆరోగ్యశ్రీ కింద ఇందుకు అవసరమైన వైద్యం అందిస్తారని తెలుసుకుని స్మైల్ ఆసుపత్రిలో వాకబు చేశామన్నారు. ఆరోగ్య మిత్ర సహాయంతో ఆ ఆసుపత్రిలో వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా స్పైనల్ సర్జరీ చేశారన్నారు. తనకు ఎంతో మెరుగైన వైద్యం అందింనందుకు ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పరిసరాల పరిశుభ్రత మనఅందరి బాధ్యత..పరిశుభ్రతతోనే ఆరోగ్యం…

-పత్రి ఒక్కరిలో స్వచ్ఛత పై అవగాహన కలిగించాలి.. -స్వచ్ఛత-శుభ్రత పై ప్రజలు నైతిక బాధ్యత వహించాలి.. -మురుగు కాలువగట్లపై చెత్తను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *