Breaking News

మనకు ఆక్సిజన్ అందించే చెట్లను మనం సంరక్షించుకోవాలి- గద్దె రామ్మోహన్ తూర్పు నియోజకవర్గం

-10,160 మొక్కలను మూడు నెలల వ్యవధిలో నగరం లో నాటబోతున్నాం- ధ్యానచంద్ర హెచ్ఎం, కమిషనర్, విజయవాడ నగర పాలక సంస్థ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మనకు ఆక్సిజన్ అందించే చెట్లను మనం కాపాడుకోవాలి అని అన్నారు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో లయోలా కాలేజ్ రోడ్డు లో జరిగిన ప్రపంచ పర్యదిన పర్యావరణ దినోత్సవ వేడుకల్లో తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ప్రపంచ పర్యావరణ దినోత్సవం లో భాగంగా ఈ సంవత్సరం ప్రధాన అంశం “ప్లాస్టిక్ పెను భూతాన్ని తరిమేద్దాం”. నగరాన్ని కాలుష్య నగరంగా ఉంచాలంటే ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని ప్లాస్టిక్లను డ్రైనేజీలో పార వేయకూడదని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, మనకు ఆక్సిజన్ అందించే మొక్కలను మనం సంరక్షించుకోవాలని అన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి పర్యావరణహితమైన వస్తువులైన గుడ్డ సంచులు, కర్ర బ్యాగులు, జ్యూట్ బ్యాగులు లాంటివి వాడాలని, ప్లాస్టిక్ వ్యర్ధాలను సైడ్ డ్రైనేజీల్లో పారెస్తే అవి నగరంలో ఉన్న కాలువలను కలుషితం చేస్తున్నాయి కాబట్టి ప్లాస్టిక్ వ్యర్ధాలను డ్రైనేజీలో పారి వేయకూడదని ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించే దిశగా అడుగులు వేయాలని అన్నారు.

ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ ఎం మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఇప్పటివరకు 27 కిలోమీటర్ల వరకు ఎవెన్యూ ప్లాంటేషన్ ఉందని, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వీటిని పెంచి నగరంలో 10,160 మొక్కలను నాటి ఎవెన్యూ ప్లాంటేషన్ను 55 కిలోమీటర్ల వరకు పొడిగించబోతున్నామని తెలిపారు. మొక్కలను కేవలం నాటడమే కాకుండా వాటిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజలు కూడా ప్రపంచ పర్యావరణాన్ని దినోత్సవాన్ని పురస్కరించుకొని వారి బాధ్యతగా మొక్కలను నాటడమే కాకుండా ప్రతి ఒక్కరూ వాటిని సంరక్షించుకొని, నీరు పోసి, వాటి నుంచి వచ్చే ఆక్సిజన్ మనకు ఎంతగానో మేలు చేస్తుందని మనం విడిచే వాయువు కార్బన్డయాక్సైడ్ అవి పీల్చి కాలుష్యాన్ని తగ్గిస్తుందని తెలిపారు.

నగర పరిధిలో ప్రతి నియోజకవర్గంలో ప్లాస్టిక్ నిషేధం పై అవగాహన కల్పించడమే కాకుండా “ఫ్యాబ్రిక్ ఇన్- ప్లాస్టిక్ అవుట్” స్టాల్స్ ని ఏర్పాటు చేశారని, శ్రీ కనకదుర్గమ్మ గుడి, పూల మార్కెట్, కాలేశ్వర రావు మార్కెట్, విఎంసి ప్రధాన కార్యాలయం, కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్, సాంబమూర్తి రోడ్ రైతు బజార్, పటమట రైతుబజార్ వద్ద ఈ స్టాల్స్ ని ఏర్పాటు చేసి ప్రజల వద్ద నుండి ప్లాస్టిక్ ని సేకరించి వారికి పర్యావరణహితమైన సంచులను పంచుతున్నామని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో హెచ్ బి కాలనీ కరెంట్ ఆఫీస్, సెంట్రల్ నియోజకవర్గం పాయకాపురం చెరువు వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించామని అన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జాస్తి సాంబశివరావు, ముమ్మనేని వెంకటప్రసాద్, చెన్నుపాటి ఉషారాణి, అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్) డాక్టర్ డాక్టర్ చంద్రశేఖర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యూసీడి) పి.వెంకట్ నారాయణ, జోనల్ కమిషనర్ కే షమీ, ఇంచార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాలకృష్ణ నాయక్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జీ సామ్రాజ్యం, మెప్మా ఎ.ఎం.డి కే. ఎన్. వెంకటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *