Breaking News

ఎంపి కేశినేని శివ‌నాథ్ ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన‌ ఎ.ఎమ్.సి చైర్మ‌న్ కొఠారు స‌త్య‌నారాయ‌ణ ప్ర‌సాద్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జ‌గ్గ‌య్య‌పేట‌ వ్య‌వ‌సాయ మార్కెట్ క‌మిటీ ఛైర్మన్ గా నియ‌మితులైన కొఠారు స‌త్యనారాయ‌ణ ప్ర‌సాద్ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో శుక్ర‌వారం టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య, ఎన్టీఆర్ జిల్లా తెలుగు రైతు సంఘం అధ్యక్షుడు చెరుకూరి రాజేశ్వ‌ర‌రావు ల‌తో క‌లిసి ఎంపీ కేశినేని శివ‌నాథ్ ను ఎ.ఎమ్.సి చైర్మ‌న్ గా నియ‌మితులైన‌ కొఠారు స‌త్య‌నారాయ‌ణ ప్ర‌సాద్ కలుసుకున్నారు.. త‌న‌పై న‌మ్మ‌కంతో మార్కెట్ యార్డ్ ఛైర్ ప‌ర్స‌న్ గా అవ‌కాశం క‌ల్పించినందుకు ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)కు కొఠారు కృతజ్ఞ‌త‌లు తెలిపారు. ఎ.ఎమ్.సి ఛైర్ ప‌ర్స‌న్ గా ఎన్నికైనందుకు ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) అభినంద‌న‌లు తెలియ‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో పెనుగ్రంచిప్రోలు మాజీ ఎంపిపి వెల్ది శ్రీనివాస‌రావు, టిడిపి నాయ‌కులు రావూరి విశ్వ‌నాథం, ముత్తినేని అశోక్, కిలారు విశ్వ‌నాథ్, పెల్లిబోయిన నాగ‌రాజు, క‌న‌ప‌ర్తి చిట్టిబాబు, పోతురాజుల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *